J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ జగిత్యాల జిల్లా కలెక్టర్ .సత్యప్రసాద్ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన సాంప్రదాయం ప్రకారం అధికారులు, అర్చకులు, వేద పండితులు మేళతాళాలతో పూర్ణకుంభంతో కలెక్టర్ ను స్వాగతించారు.

దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం కలెక్టర్ కు అందించారు. అన్నదానం సత్రాన్ని పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వారికి త్రాగునీరు సదుపాయానికి ఇబ్బంది కలుగకుండా శుభ్రమైన త్రాగునీరు వసతి కల్పించాలని సూచించారు. అనంతరం గోదావరి పరిసరాలను పరిశీలించారు. వానాకాలం దృష్టిలో ఉంచుకుని దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ వెంట జగిత్యాల, ఆర్డీఓ మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ వేదపండితులు, సీనియర్ అసిస్టెంట్ పురోహితులు ,స్థానిక తహశీల్దార్, మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

👉సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ !
ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా O.P. సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఎంతమంది డెలివరీలు అయ్యారని, ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలను పెంచుటకు గర్భిణులను ప్రోత్సహించాలని డాక్టర్లకు సూచించారు. ఆసుపత్రిలో పేషెంట్లకు నాణ్యమైన ఆహారాన్ని, త్రాగునీరు అందిస్తున్నారా లేదా ? లేని యెడల వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో శుభ్రమైన త్రాగునీరు సరఫరా చేసే విధంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు.

ల్యాబ్ విభాగాన్ని తనిఖీ చేసి టి-హబ్ కి పంపే డయాగ్నోస్టిస్ పరీక్షల రికార్డును కలెక్టర్ పరిశీలించారు. ఐ.సి. యు. కి సంబంధించిన పరికరాలను, సిబ్బంది గురించి మరియు రెండవ అంతస్తు పై అదనపు వార్డుల నిర్మాణం పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
