ధర్మపురి తెలుగు కళాశాలకు మహర్దశ !

👉సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చొరవతో త్వరలో నైట్ కళాశాల ప్రారంభం !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

దశాబ్దాల చరిత్ర గల ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ

సంస్కృతాంధ్ర కళాశాలకు (నైట్ కాలేజి) మహర్దశ

పట్టనున్నది.

ఉత్తర తెలంగాణ జిల్లాలో వేలాదిమంది నిరుద్యోగ యువతకు కామదేనువుగా సాయం కళాశాలగా ధర్మపురిలో కొలువైంది. వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్భవించిన పవిత్ర సంస్థ తెలుగు కళాశాల.

ఈ కళాశాలకు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో లెక్చర్లల్లో నియామకం చేపట్టక, నిధులు మంజూరు చేయకుండా గత కొన్ని సంవత్సరాల కాలంగా నిరవధికంగా మూసివేశారు.

ఉపాధ్యాయులు, విద్యావేత్తల, పట్టణ ప్రజల ఆకాంక్షల మేరకు, శాసనసభ ఎన్నికల్లో తెలుగు కళాశాలను తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తాను అంటూ ఇచ్చిన హామీ మేరకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో త్వరలో తెలుగు కళాశాల తిరిగి ప్రారంభం కానున్నది.


👉వివరాలు ఇలా ఉన్నాయి


ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ (RJD) యాదగిరి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి శనివారం ధర్మపురి లోని తెలుగు కళాశాలను సందర్శించారు.


👉ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మపురి నైట్ కాలేజిలో, టీచింగ్ స్టాఫ్ లేక కళాశాలను మూసివేశారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఈ కళాశాలను తిరిగి ప్రారంభించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కు కళాశాల పరిస్థితి వివరించి వినతి పత్రం ఇచ్చినట్టు వివరించారు.

కళాశాలను పునః ప్రారంభించే వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులతో మాట్లాడి ఔట్ సోర్సింగ్ పద్ధతితో ఉద్యోగులను, పారిశుద్ధ్య సిబ్బందిని మరియు ఉపాధ్యాయులను కళాశాలలో నియమించాలని వారిని కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

సంవత్సరానికి దాదాపు ₹ 30 లక్షల రూపాయల వరకు వ్యయం కానున్నట్టు రీజినల్ జాయింట్ డైరెక్టర్ కు ఈ కళాశాల పై నివేదికను విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపించి తనకు సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.


ఈ అంశంతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రితో ఈ ప్రాంత త్రాగు, సాగు నీటి విషయం గురించి పలు మార్లు చర్చించడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల, ఐటిఐ కలశాల, పాల్ టెక్నిక్ కలశాల ఏర్పాటులో తన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు
ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.