👉ధర్మపురి ఆలయంలో పుస్తకానికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు…
J.SURENDER KUMAR,
ఆయన ప్రపంచ గుండె వైద్య ప్రముఖ నిపుణులలో ఒక్కరు. తెలుగు రాష్ట్రాలలో ఆయన గుండె వైద్యం, పేరు తెలియని వారు అరుదు. నేటి ఆధునిక సమాజంలో ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల భవిష్యత్తులో రానున్న గుండె సంబంధిత సమస్యలు, వ్యాధులు,
కోవిడ్ అనంతరం వచ్చిన గుండె సంబంధిత సమస్యలు, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు, వైద్యులు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలతో ప్రపంచ గుండె వైద్య చికిత్స చరిత్రలో డాక్టర్ శ్రీధర్ కస్తూరి కలం నుంచి పురుడు పోసుకున్న అరుదైన పుస్తకం ఆవిష్కరణకు ముందు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులు వేద పండితులతో డాక్టర్ శ్రీధర్ కస్తూరి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రత్యేక పూజలు చేయించారు.

👉పుస్తకం గురించి….
దీనిలో గుండెకు సంబంధించిన దాదాపు వందకు పైగా అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు, వాటి వివరాలు, చిత్రాలు, వీడియో లింకులు ఉన్నాయి. ఈ పుస్తకం కార్డియాలజీ లో సూపర్ స్పెషలైజేషన్ చేసి ఇంకా మెళుకువలు తెలుసుకునే వైద్యులకు ఒక వరం.
ఇలాంటి పుస్తకం ప్రపంచ కార్డియాలజీ చరిత్రలో రావడం మొట్టమొదటిది.

దీనిని జాతీయ ప్రఖ్యాత సంస్థ జేపీ ప్రచురించింది. ఈ పుస్తకం భారతదేశంలోనీ అన్ని వైద్య కళాశాలలో, కార్పొరేట్ హస్పిటల్స్ లో రిఫరెన్స్ పుస్తకంగా ఉపయోగపడుతుంది.
ఈ పుస్తకం గురించి ప్రపంచం కార్డియాలజీ ఇప్పటికే ఆత్రుత మరియు ఆసక్తి తో ఎదురుచూస్తున్నది.
గత ఐదు సంవత్సరాల కాలంకు పైగా డాక్టర్ శ్రీధర్ కస్తూరి, వివిధ క్లిష్టతరమైన గుండె సంబంధిత వ్యాధుల కేసులను పరిశీలించి, వైద్యం, చేసిన చికిత్స అంశాలు అనుభవపూర్వకంగా ఈ పుస్తకంలో నమోదు చేశారు. ఈ పుస్తకం ఇదివరకే అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన డాక్టర్ శ్రీధర్ కస్తూరి నీ ప్రపంచ కార్డియాలజీ సువర్ణ అధ్యాయంలో ముందు వరసలో ఉంచుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

జూలై మొదటి వారంలో చెన్నై మహానగరంలో ప్రపంచ కార్డియాలిస్టుల ( వివిధ దేశాల నుంచి వచ్చే మూడు వేలమంది ప్రముఖ గుండె వైద్య నిపుణులు) సమావేశంలో ఈ పుస్తకం ఆవిష్కరించనున్నట్టు డాక్టర్ శ్రీధర్ కస్తూరి తెలిపారు. పుస్తకం ధర ₹ 7995/- ఇతర దేశాలలో దాదాపు రెండు వందల డాలర్లకు పైగా ఉండవచ్చని వైద్యుల భావిస్తున్నారు. పూజా కార్యక్రమనికి పలువురు వైద్యులు హాజరయ్యారు.