ఫ్లాష్..ఫ్లాష్. జగిత్యాలకు మంత్రి శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మాట్లాడడానికి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రేణులతో చర్చించి శాంత పరచడానికి రాష్ట్ర ఐటీ శాసనసభ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం సాయంత్రం జగిత్యాల కు రానున్నట్టు తెలిసింది.

ఢిల్లీ, రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకత్వం ట్రబుల్ షూటర్ మంత్రి శ్రీధర్ బాబుతో, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అలక, ఆగ్రహంపై రాజకీయ అంశాలపై పలుమార్లు చర్చించినట్లు తెలిసింది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు హుటాహుటిన జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి పయనమైనట్టు సమాచారం.
జీవన్ రెడ్డి ఇంటిలో ప్రభుత్వ విప్ లు ధర్మపురి, వేములవాడ ఎమ్మెల్యే లు లక్ష్మణ్ కుమార్, శ్రీనివాస్ ఉన్న విషయం తెలిసిందె.