👉నాకు ఏ పదవులు వద్దు !
👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
👉జీవన్ రెడ్డి నివాసంలో…
ప్రభుత్వ విప్ లు లక్షణ్ కుమార్, ఆది శ్రీనివాస్
👉జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
👉కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నాయకత్వం..
J.SURENDER KUMAR,
గౌరవం లేని పార్టీలో నేను కొనసాగలేను, రాజీనామా చేస్తాను, నాకు ఏ పదవులు వద్దు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలతో అంటున్నారు. ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ప్రభుత్వ విప్ లు ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెల్లవారుజామున జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.
👉ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా ఆలోచన కు కారణం !
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే అనుచరులు కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవటంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలను అదుపు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు బారి కేడ్లను ఏర్పాటు చేశారు.
భవిషత్ కార్యాచరణ పై కార్యకర్తలతో చర్చిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ లో చేరటంపై నియోజకవర్గ వ్యాప్తంగా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
👉ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం!

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు.

ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత. ఆ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన ఆస్పత్రి ముందు బైఠాయించారు. ఏ క్షణం ఏమి జరగనున్నదో అనే ఉత్కంఠ పట్టణంలో నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలు మొహరించాయి.