👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద మాటకారి, మాటల మాంత్రికుడు అబద్ధాన్ని నిజం అని నమ్మించడంలో దిట్ట..
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ప్రజా సంక్షేమ పథకాల పై బురద చల్లలనే ఉద్దేశంతో హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసత్య ఆరోపణలు, చేస్తున్నాడని
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అన్నారు. మంగళవారం హైదరాబాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
👉అయన మాటలు ఇలా ఉన్నాయి…
👉 రాష్ట్రంలో BRS పార్టీ మూడో స్థానంలో ఎందుకు ఉండిపోయింది, ఓట్లు ఎందుకు తగ్గాయి,దానికి కారకులు ఎవరు..
👉 BRS ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన వారు,నాయకులు ఇప్పుడు ఎందుకు బైటకి వచ్చి మాట్లాడటం లేదు.
👉 బడి బాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా 62 వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు యూనిఫామ్స్,టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.
👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో జరిగిన కాళేశ్వరం నీటి దోపిడీ లో నీళ్ళు ఎవరు దోచుకెళ్తున్నరో హరీష్ రావుకి తెలీదా..
👉 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను నూటికి నూరుశాతం అమలు చేసి తీరుతాం.
👉 ఇదే విధమైన సత్యదురితమైన మాటలు మాట్లాడితే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో BRS నాయకులకు తెలుసు. తెలుసుకోవాలి అని అన్నారు.