ఇన్చార్జి పాలనలో ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఎక్కడ ?

👉ఆలయ అభివృద్ధి పనుల పై సమీక్ష ఏది ?


J.SURENDER KUMAR,


ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ అధికారి పాలనలో ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత, ప్రోటోకాల్ అంశాలు ఏదో మొక్కుబడిగా ఉద్యోగులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ధర్మపురి ఆలయ అభివృద్ధి పనుల అంశంలో అధికారులు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో గత ఆరు నెలల కాలం లో ఒక్కరోజు సైతం సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భం లేదు.


👉వివరాల్లోకి వెళ్తే.


గత దశాబ్ద కాలంగా కెసిఆర్ ప్రభుత్వంలో ధర్మపురి ఆలయ అభివృద్ధికి వందలాది కోట్ల నిధులు కేటాయించాము, పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ, ప్రచార సాధనాల్లో ఊదరగొట్టారు. భూమి పూజకు సైతం నోచుకోని పనులు, భూమి పూజలు జరిగినా , ప్రారంభం కాని పనులు, ప్రారంభమైన పనులు సైతం పూర్తికాని వైనం, తదితర సమస్యలతో ఆలయ పనులు ఆటకిక్కాయి.
కెసిఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఆలయ అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో అభివృద్ధి పనులు, నిధుల కొరత, ఆసంపూర్తి పనులు, తదితర అంశాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన సందర్భం లేదు.

👉ప్రజా ప్రతినిధులను పట్టించుకోని వైనం..?

భక్తుల సౌకర్యార్థం వేలాది రూపాయల విలువ గల వాటర్ కూలర్లు ఆలయానికి ఓ దాత అందించారు. ( పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలకు కొన్ని రోజుల ముందు ) కొన్ని రోజులపాటు వాటర్ కూలర్ లు కూలర్లు రాజగోపురం పక్కన ఉంచారు. స్థానిక ఎమ్మెల్యేతో వాటిని ప్రారంభించకుండా ఇటీవల జరిగిన జాతర ఉత్సవాలలో కలెక్టర్ తో వాటిని ప్రారంభించారు. ( పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందున కలెక్టర్ తో ప్రారంభించాము. అంటూ ఆలయ అధికారుల వివరణ) వాటర్ కూలర్ ల విలువ, దాతల పేర్లు, పత్రికా ప్రకటనల్లో పేర్కొనలేదు. కూలర్ల పై దాతల పేర్లు లేవు, చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా దేవదాయ కమిషనర్ ధర్మపురి ఆలయ పర్యటన నేపథ్యంలో కూలర్ లపై దాతల పేర్లు రాశారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ తో ప్రారంభిస్తున్న కూలర్ పై దాతల పేర్లు లేని దృశ్యం ( ఫైల్ ఫోటో)


👉పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి ప్రభుత్వ యంత్రాంగంలో కీలక నేత ఒకరు సాయంత్రం స్వామివారిని దర్శించుకున్నారు. కార్యాలయ ప్రాంగణంలోని గదికి సిబ్బంది తాళం వేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రేకుల షెడ్డు కిందే ఆ కీలక నేత ( కాన్ఫిడేషన్) ఫోన్ కాల్, మాట్లాడారు. బయట నుండి, టి, కాఫీ, వాటర్ బాటిల్ తేప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ అంటు, మా సార్ వద్దన్నారు అని సిబ్బంది వివరణ ఇచ్చుకున్నారు.


👉గత కొన్ని రోజుల క్రితం చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ నాయకుడు కుటుంబ సభ్యులతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందంటూ ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదం ఒక్కరి కే ఆలయ పక్షాన అందించారు. వారి కుటుంబ సభ్యులకు డబ్బులు చెల్లించి లడ్డు ప్రసాదం కొనుగోలు చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ శ్రేణులకు ఏర్పడింది.


గత కొన్ని రోజుల క్రితం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉద్యోగులు స్వీపర్లు, వేద పండితులు, అర్చకులు, తమ వేతనాలు, సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం కు వెళ్లి తమ ఆవేదన, గోడును చెప్పుకొని బాధపడ్డారు.

దేవాదాయ శాఖ కమిషనర్ రాక సందర్భంగా వాటర్ కూలర్లపై ఆలయ అధికారులు దాతల పేర్లు వ్రాయించారు ( ఫైల్ ఫోటో)


ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది, అర్చకుల సమస్యలు ఏమిటి ? పరిష్కారం ఎలా చేద్దాం ? అంటూ తదితర అంశాలపై ఆలయ ఇంచార్జ్ ఈ ఓ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పిలిపించి వివరణ కోరినట్టు సమాచారం.

👉ఇష్టారాజ్యం..

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం రెగ్యులర్ ఈ. ఓ గా విధులు నిర్వహిస్తు అధికారికి, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం తో తో పాటు, బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ, అక్క పెళ్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇంచార్జ్ ఈ. ఓ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

వారంలో ఒకటో, రెండో రోజులు వచ్చే అధికారి తీరుతో ధర్మపురి ఆలయంలో కొందరు ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది, ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. సమయపాలన, డ్రెస్ కోడ్, మర్చిపోయారు. కొందరు తాము ఆలయంలో విధులు నిర్వహించే చోటును (స్పాట్) వదిలి వీఐపీ సేవలో తరిస్తూ, రాజగోపురం వాహనం వద్దకు వెళ్లి వాహనం డోర్ తెరిచిస్వాగతం, డోర్ వేసి వీడ్కోలు పలకడం షరా మామూలుగా మారింది.

మంగళ వాయిద్యాలు వినిపించాల్సిన ప్రాంగణంలో సెల్ ఫోన్ రింగ్ టోన్లు వినిపిస్తున్నా యి. సిబ్బంది డ్రెస్ కోడ్, నేమ్ ప్లేట్లు వారు ధరించకపోవడంతో భక్తులు ఎవరో ? అధికారులు ఎవరో ? సిబ్బంది ఎవరో ? తెలియని గందరగోళ దుస్థితి భక్తులలో నెలకొంది.

పూజ టికెట్ల వివరాలు, సేవలు, వసతి గృహాల సౌకర్యం, ఉచిత అన్నదాన సమయం, అవి లభించే టోకెన్లు ఇచ్చే కౌంటర్ వాటి వివరాలు భక్తులకు అగుపించేలా ( హిందీ, ఇంగ్లీష్ భాషలలో ) ఫ్లెక్సీలు, బోర్డులు, దాతల పేర్లు ఆలయ ప్రాంగణంలో అగుపించడం లేదనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.
దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాల్సిందిగా స్థానికులు భక్తులు ముక్తకంఠంతో కోరుకున్నారు.