👉సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ!
J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ అమలుతోపాటు, యావర్ రోడ్డును 100ఫీట్ల మేర విస్తరణ చేపట్టేందుకు అవసరమైన దాదాపు ₹ 100 కోట్ల నిధులు మంజూరు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం లేఖ రాశారు.
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు.
👉లేఖలోని వివరాలు ఇలా ఉన్నాయి.
జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ లో మాస్టర్ ప్లాన్ అమలు గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేయకపోవడం తో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా అన్నపూర్ణ చౌరస్తా నుండి పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు యావర్ రోడ్డు విస్తరణ పనులు కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించుకొని, యావర్ రోడ్డు విస్తరణకు కావలసిన నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో రోడ్డు భవనాల శాఖా మంతిగా పనిచేసిన నేను జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి నుండి సాయిబాబా గుడి మీదుగా ధర్మపురి రోడ్డు వరకు బైపాస్ రోడ్డు వేసి, వాహనాల రద్దీని తగ్గించేందుకు కృషి చేశాను అని పేర్కొన్నారు. ప్రస్తుతము జిల్లా కేంద్రం గా కొనసాగుతున్న జగిత్యాల పట్టణం, పెరుగుతున్న జనాభా దృష్ణా జగిత్యాల మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని జీవన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు..
జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డు ను గతంలో 40 ఫీట్ల నుండి 60ఫీట్లకు విస్తరించినప్పటికి పెరుగుతున్న జనాభా దృష్ట్యా రోడ్డును 100′ ఫీట్లకు విస్తరించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని 2017లో జగిత్యాల మున్సిపాలిటీ యావర్ రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని తీర్మానం చేసిందని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలకు ప్రతిపాదనలు పంపినప్పటికి, ఇట్టి అంశాన్ని అప్పటి టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండ పెండింగ్ లో పెట్టిందన్నారు. 2018 సాధారణంగా సాధారణ శాసన సభ ఎన్నికల్లో లబ్ధి పొందబడేవిధంగా ప్రయత్నం చేయబడి తిరిగి రెండవ పర్యాయం అధికారానికి వచ్చి రోడ్ల విస్తరణలో బాధిత వ్యక్తులకు కు చెల్లించాల్సిన పరిహారం నిమిత్తం ఏవిధమైన నిధులు విడుదల చేయలేదన్నారు. కేవలం TDR ను తెరపైకి తీసుకువచ్చి, ఐదేళ్లు విస్తరణ పనులు పెండింగ్ లో పెట్టారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాలనాలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నిరంతరం తాగునీరు సరఫరా చేసే మున్సిపాలిటీగా, రోడ్డుపై తోపుడు బండ్లు, కూరగాయల విక్రయించుకునే, చిరువ్యాపారుల నుండి వసూలు చేసే తైబజార్ పన్నుల వసూలు రద్దు చేసిన మున్సిపాలిటీగా ఘనత సాధించింది.
మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి, జగిత్యాల పట్టణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉన్న పరిస్థితులలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆస్తులు కోల్పోయేవారికి పరిహారం చెల్లింపునకు అంచనాలు రూపొందించగా దాదాపు ₹100 వరకు అంచనా వేయడం జరిగిందన్నారు.
కావున ఈ పరిస్థితులలో జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రం కావటముతో, విస్తరించుటకు కావలసిన విధులు ₹100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ నుండి మంజూరి ఇప్పించగలరని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ లో పేర్కొన్నారు.