జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై మాజీ సీఎం కేసీఆర్ ఆరా ?

👉ఫామ్ హౌస్ కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కు పిలుపు?


J.SURENDER KUMAR,


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక, ఆగ్రహం ఎపిసోడ్ పై మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్టు సమాచారం. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న అంశాన్ని వదిలేయండి అంటూ మాజీ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ శ్రేణులకు కీలక నాయకులతో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం వరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు రావాలని వారికి బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.

జగిత్యాలకు మంత్రి శ్రీధర్ బాబు రావడం, జీవన్ రెడ్డి తో చర్చల వివరాలను, టిఆర్ఎస్ అధిష్టానంకు జగిత్యాల క్యాడర్ వివరించినట్టు తెలిసింది. సోమవారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం, ఆయన ఆస్పత్రి ముందు నిరసనలు చేపట్టిన ఆ పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రేణులు కార్యకర్తలు మంగళవారం మౌనం వహించడంలో మర్మం అంతు పట్టడం లేదనే చర్చ మొదలైంది.


మాజీ సీఎం కేసీఆర్ కు నమ్మకస్తుడైన కీలక మాజీ ప్రజా ప్రతినిధి జగిత్యాల ఎపిసోడ్ పై సమగ్ర నివేదికను మంగళవారం తెల్లవారుజామున టిఆర్ఎస్ అధిష్టానానికి అందించినట్టు సమాచారం.


దీనికి తోడు బీఆర్ఎస్ అనుకూల దినపత్రికలో ‘ జీవన్ రెడ్డికి పొగ’ అంటూ మొదటి పేజీలో వార్తా ప్రచురించారు. పార్టీ ఫిరాయించిన తన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై భగ్గుమన్న టిఆర్ఎస్ శ్రేణులు అనే వార్తను రెండవ పేజీలో ప్రచురించారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశం మంగళవారం రాత్రి కి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం తన శ్రేణులకు వివరించినట్టు సమాచారం.