కర్తవ్యం దైవం – టీటీడీ ఈ.ఓ శ్యామల రావు !

J.SURENDER KUMAR,


కర్తవ్యం దైవం” అని తాను బలంగా విశ్వసిస్తానని, జవాబుదారీతనం మరియు పారదర్శకతతో విధులు నిర్వర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తానని టీటీడీ నూతన కార్యనిర్వహణాధికారి  జంజం శ్యామలరావు పేర్కొన్నారు.

టీటీడీ కార్యనిర్వహణాధికారి గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆదివారం సాయంత్రం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం. “నాపై నమ్మకం ఉంచి ఈ గౌరవనీయమైన పదవిని ఎంచుకున్నందు కు సర్వశక్తిమంతుల కు, నా తల్లిదండ్రులకు మరియు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్ర బాబు నాయుడు కు నేను కృతజ్ఞతలు” అని ఆయన తెలిపారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాత్రికుల కేంద్రం, టీటీడీ ఖ్యాతిని పెంపొందించేందుకు సీఎంకు స్పష్టమైన విజన్ ఉందన్నారు. “నేను నిబంధనల ప్రకారం అన్ని పనులను నిర్వహిస్తాను మరియు భక్తులకు దర్శనం, వసతి, రవాణా, అన్నప్రసాదం మొదలైన వాటి పరంగా సౌకర్యాలను మెరుగుపరుస్తాను. ప్రతి ఒక్క భక్తుడికి సంతృప్తిని కలిగించే విధంగా ఒక చిరస్మరణీయ అనుభూతిని అందిస్తాను” అని ఆయన చెప్పారు. ఉద్యోగుల సమిష్టి కృషి, మీడియా సూచనలతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఈఓ తెలిపారు. జె ఇ ఓ లు  వీరబ్రహ్మం, శ్రీమతి గౌతమి, సివిఎస్‌వో  నరసింహ కిషోర్, సిఇ  నాగేశ్వరరావు, ఎస్ఇ 2  జగదీశ్వర్ రెడ్డి, సిపిఆర్వో డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు.

👉క్యూ లైన్లను తనిఖీ యాత్రికులతో మాట ముచ్చట !


టీటీడీ ఈవో  జె శ్యామలరావు ఆదివారం సాయంత్రం క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లను పరిశీలించి భక్తులతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన తొలి తనిఖీలో అనేక మంది భక్తులకు భోజన, నీటి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను స్వీకరించారు.
కొన్ని చోట్ల భక్తులకు అన్నం, నీరు అందుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని తెలిపారు. “ఈ ఖాళీలను పూరించడానికి, క్యూ లైన్లు మరియు షెడ్లలో వేచి ఉన్న భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని నేను సంబంధిత అధికారులను వెంటనే ఆదేశించాను” అని ఆయన కొనసాగించారు.


జేఈవో  వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్, సీఈవో  షణ్ముఖ్ కుమార్, సీఈ  నాగేశ్వరరావు, ఎస్ఈ 2  జగదీశ్వర్ రెడ్డి, డీవైసీఎఫ్ శ శ్రీనివాసులు, సీపీఆర్వో డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు.