కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం!


👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్!

J.SURENDER KUMAR,

పెద్దపెల్లి పార్లమెంట్  సభ్యుడిగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గడ్డం వంశీకృష్ణ గెలిపించిన పెద్ధపెల్లి పార్లమెంట్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎంపీ వంశీకృష్ణ, నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటము అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్   అన్నారు.

ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్   మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.


మీడియా సమావేశ ముఖ్యాంశాలు..


👉🏻 మంత్రివర్యులు శ్రీధర్ బాబు  నాయకత్వంలో పార్లమెంట్లోని ప్రతి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎండను సైతం లెక్క చేయకుండా వంశీ గెలుపుకోసం కృషి చేశారన్నారు.    

    
👉🏻ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి పుణ్య క్షేత్రం కాబట్టి, బీజేపీ నాయకులు హిందూ మతం, పేరుతో సెంటిమెంట్ వాతావరణాన్ని సృష్టించడం వల్ల ఓటింగ్ శాతం కొంత తగ్గిందన్నారు. 


👉🏻 ఎలక్షన్ కోడ్ అనంతరం ప్రభుత్వ ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డుల జారీ వంటి ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలు ధర్మపురి నియోజక వర్గంలో ప్రతి పేద ప్రజలకు అందించే విధంగా మా ప్రణాళిక ఉంటుంది అన్నారు.    


👉🏻 ఈ ప్రాంతంలో పత్తిపాక రిజర్వాయర్ ను ఏర్పాటు చేసి ధర్మారం, వెల్గటూర్ మండలంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం అన్నారు.    


👉🏻కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు,కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా పనిచేయాలి, ఎవ్వరూ భేషజాలకు, గొడవలకు వెళ్ళకూడదు.  


👉🏻 కింది స్థాయి నాయకుల నుండి పై స్థాయి నాయకుల వరకు ఎవరు ఏమీ చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.


👉🏻  BRS పార్టీ నాయకులు తమ పార్టీ ఎలాగో గెలవదని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ గెలవకుండా  బీజేపీకి ఓట్లు వేయమని ప్రచారం చేశారని ఆరోపించారు.


👉🏻 అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి నీ  కొప్పుల ఈశ్వర్ చెయలేదు, పేదల సంక్షేమన్ని పూర్తిగా మరిచారు. BRS నాయకులకు ఎదురు మాట్లాడితే వారిని బెదిరించడం, వారిపై దాడులు చేయించడం జరిగిందన్నారు.


👉రెండు లక్షల ఎల్ఓసి..

ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన గజ్జెల రాజేశం గారికి హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స నిమిత్తం ₹ 2 లక్షల 10 వేల  LOC ని  ఎమ్మెల్యే అడ్లూరీ లక్ష్మణ్ కుమార్  బుధవారం రోజున రాజేశం  కుటుంబానికి  అందించారు.