👉 అంగరంగ వైభవంగా కొండగట్టు అంజన్న జయంతి ఉత్సవాలు !
👉 శుక్రవారం రాత్రి నుండి పోటెత్తిన భక్తజనం !
👉 శుక్రవారం రాత్రి ఏర్పాట్లును పరిశీలించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష !
👉 భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అవస్థలు పడుతున్న యంత్రాంగం !
👉 పట్టు వస్త్రం స్వామివారికి అందించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ !
J.SURENDER KUMAR,
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలు
అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వరదల క్షేత్రానికి
తరలివస్తున్న అంజన్న భక్తులతో కొండగట్టులో కుండపోత
ప్రవాహంల భక్తజనంతో పోటెత్తింది. శుక్రవారం రాత్రి నుండి
దీక్షా స్వాములు రాకతో శనివారం తెల్లవారుజామున కే
కొండగట్టు క్షేత్రం కిక్కిరిసింది.

దాదాపు రెండు లక్ష ల మంది అంజన్న స్వాములు రానున్నారు అనే ముందస్తు నిఘవర్గాల సమాచారంతో జగిత్యాల్ కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష శుక్రవారం రాత్రి 10 గంటలకు కొండగట్టుకు చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. భక్తజనంకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి స్వాములు మాలా విసర్జన క్యూలైన్లలో వేచి ఉన్నారు.

👉పట్టు వస్త్రం సమర్పించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ !

పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు స్వయంగా సిద్ధం చేసిన పట్టు వస్త్రాన్ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ద్వారా అంజన్న స్వామికి అందించారు. శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అర్చక స్వాములు సాంప్రదాయబద్ధంగా, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

👉అర్ధరాత్రి నుంచి…

అంజన్న స్వాములకు అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించడానికి, దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయత్ రాజ్, మిషన్ భగీరథ, విద్యుత్ , వైద్య ఆరోగ్యశాఖ, యంత్రాంగం కృషి చేస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ ప్రత్యేకంగా నియమించిన అధికారులు పర్యవేక్షణలో యంత్రాంగం సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.

👉ధర్మపురి కి పోటెత్తిన అంజన్న భక్తులు !

కొండగట్టు స్వామిని దర్శించుకున్న అంజన్న భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచే ధర్మపురి క్షేత్రానికి రావడంతో, గోదావరి నది తీరం, ఆలయ ప్రాంగణం భక్తజనంతో పోటెత్తింది. ఆలయ ప్రాంగణం, గోదావరి నది తీరం భక్తజనంతో కిక్కిరిసిపోయింది.

👉సమాచార శాఖ అడ్రస్ ఎక్కడ ?

తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పెద్ద జయంతి ఉత్సవాలలో, కొండగట్టు ఆలయ ప్రాంగణంలో సమాచార శాఖ అడ్రస్, ఉనికి కనిపించడం లేదు లేదు. మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఉత్సవాలలో ప్రముఖులు, వీఐపీలు, స్వామివారి దర్శించుకుని ముడుపులు కడతారు. దాదాపు రెండు లక్షల మంది ఆంజనేయ స్వామి దీక్ష పరులు కొండగట్టు క్షేత్రానికి తరలిరానున్నారని అధికార యంత్రాంగం ముందస్తుగా అంచనా వేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది.

ఈ భక్త జనంమేళ, ప్రముఖుల , వీఐపీల వివరాలను, ఫోటోలను, భక్తుల రద్దీని, ప్రభుత్వ యంత్రాంగం భక్తులకు అందిస్తున్న సేవలను, విస్తృతస్థాయిలో ప్రచారం కోసం, ప్రచార సాధనాలకు, ప్రభుత్వ పక్షాన అందించే జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించిన స్టాల్, అధికారి, కనీసం ఫోటోగ్రాఫర్ గాని కొండగట్టు క్షేత్రంలో లేరు. సమాచార శాఖ కమిషనర్, ఈ అంశంలో విచారణ జరిపి చర్యలు చేపట్టాలని పాత్రికేయులు కోరుతున్నారు.