మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ధర్మపురి !

👉 ఉమ్మడి రాష్ట్రం 1990 లో తెలంగాణ వివక్షత పై గళం విప్పిన శ్రీపాదరావు, రత్నాకర్ రావు !

👉 APUWJ జర్నలిస్టు సంఘం సెమినార్ లు!

J.SURENDER KUMAR,


తెలంగాణ సాధన మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ధర్మపురి గోదావరి తీరం లో  జరిగిన పుష్కర యాగం అనేది అక్షర సత్యం. పుష్కర యాగానికి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏమిటి ?  అనే అనుమానాలు సహజం.


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పట్ల ప్రభుత్వ వివక్షత పై, ప్రభుత్వానికి తెలంగాణ గళం వినిపించింది స్వర్గీయలు ,మాజీ స్పీకర్ దుదిల్ల శ్రీపాదరావు, జువ్వాడి రత్నాకర్ రావులు అనే అంశం అధికారికంగా నమోదయింది.

ప్రొఫెసర్ జయశంకర్ సార్, బియ్యాల జనార్దన్ రావు, జర్నలిస్టు సంఘ నాయకులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ, తదితర నాయకులు పత్రికలలో తెలంగాణ యాస భాష వక్రీకరణ పై సెమినార్ ఏర్పాటు చేస్తూ. రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరులు ఊదిన ఘనత జర్నలిస్టు సంఘానికి చెందుతుంది

వివరాల్లోకి వెళితే..


2001 లో కెసిఆర్ హైదరాబాద్ జలవిహార్ టిఆర్ఎస్ పార్టీ ప్రకటించి, మొదటి భారీ బహిరంగ సభ ( సింహ గర్జన ) కరీంనగర్ లో నిర్వహించారు.  ఉమ్మడి రాష్ట్రంలో  తెలంగాణలో పుణ్యక్షేత్రాలకు గుర్తింపు లేదనీ 2003 లో గోదావరి నది పుష్కరాల్లో  నిధులు, ప్రాధాన్యత, ప్రచారం ఇవ్వలేదు అని చంద్రబాబు ప్రభుత్వంపై  కెసిఆర్ ఆరోపణలు చేశారు. 

యాగానిక లక్షలాది రూపాయల వివరాలు అందిస్తున్న కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఈ నేపథ్యంలో కెసిఆర్ లక్షలాది రూపాయల విరాళాలు  సేకరించి శ్రీ మఠం పీఠాధిపతి, శ్రీ శ్రీ సచ్చితనంద స్వామి తో గోదావరి నది తీరంలో తొమ్మిది రోజులపాటు  పుష్కర యాగం ఘనంగా నిర్వహించారు.

ఈ యాగం గూర్చి తెలంగాణలో విస్తృతస్థాయిలో ప్రచారం జరిగింది. దీంతో  ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు  ధర్మపురి క్షేత్రానికి వచ్చి గోదావరి నీళ్లు తలపై చల్లుకొని నరసింహ స్వామిని దర్శించుకోక తప్పలేదు.  అనంతరం జరిగిన 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ కాంగ్రెస్  కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

👉ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు మొదటిసారి పుష్కర నిధులు సాధించిన వీరులు !

1991లో ధర్మపురి పుష్కర పనులు ప్రారంభిస్తున్న శ్రీపాదరావు, రత్నాకర్ రావు ( ఫైల్ ఫోటో)


గోదావరి నది పుష్కరాలు అంటే ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి లోనే కాదు, మా తెలంగాణలో గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ గోదావరి నదికి పుష్కరాలు జరుగుతాయి. ఆ పుష్కరాలను  (పర్వాని) అంటారు. బాసర, ధర్మపురి, మంథని ,కాలేశ్వరం పుణ్యక్షేత్రాల గుండా గోదావరి నది ప్రవహిస్తుందని  శాసన సభాపతి హోదాలో స్వర్గీయ దుదిల్ల శ్రీపాదరావు,  నాటి ధర్మపురి (బుగ్గారం) ఎమ్మెల్యే స్వర్గీయ మాజీమంత్రి జువ్వడి రత్నాకర్ రావు తో కలిసి అప్పటి  ముఖ్యమంత్రిని డిమాండ్ చేసి 1991 గోదావరి నది పుష్కర నిధుల ను సాధించారు. 

అ నిధులతో ధర్మపురి, మంథని ,కాలేశ్వరంలో సిమెంట్ రోడ్లు, భక్తుల సౌకర్యార్థం తడుకల పందిళ్లు, ఆలయాలకు రంగులు వేయించారు.


పుష్కరాల్లో ఆంధ్ర లోని రాజమండ్రి గోదావరిలో పుష్కర స్నానం చేయకుండా, ధర్మపురి, కాలేశ్వరం, మంథని నది తీరాల్లో తమతోపాటు పలువురు ప్రముఖులను పుష్కర స్నానాలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రాంతానికి వీరిద్దరూ ఆహ్వానించి తెలంగాణ పుణ్యక్షేత్రాల విశిష్టతలను వారికి వివరించారు.

👉ఉమ్మడి రాష్ట్రంలో APUWJ ఆధ్వర్యంలో…

సెమినార్ లో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్, మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు, ప్రొఫెసర్ ఉయ్యాల జనార్దన్ రావు, దేవులపల్లి అమర్, అల్లం నారాయణ ( ఫైల్ ఫోటో)


తెలంగాణ ప్రజలు – ఆకాంక్షలు – మీడియాలో వక్రీకరణ ‘ అనే అంశంపై ఏపీడబ్ల్యూజే సెమినారు నిర్వహించింది. ఈ నేపథ్యంలో   జాతీయ పత్రికా దినోత్సవ సందర్భంగా.. నవంబర్ 16 2000 సంవత్సరం లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్ లో. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, నాటి బుగ్గారం ఎమ్మెల్యే మాజీ మంత్రి జువ్వడి రత్నాకర్ రావు,  జర్నలిస్టు నాయకులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణలు జిల్లా యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్ లో  వారు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు.

👉స్వరాష్ట్రంలో కెసిఆర్ ధర్మపురిలో పుష్కర స్నానం !

2015 సీఎం హోదాలో కెసిఆర్ కుటుంబం ధర్మపురి గోదావరిలో పుష్కర స్నానం (ఫైల్ ఫోటో)

రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ధర్మపురి క్షేత్రమని, 2003 ఉమ్మడి రాష్ట్రంలో ఇక పుష్కర స్థానం చేసిన కెసిఆర్, 2014 లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర లో కెసిఆర్  2015 గోదావరి నది పుష్కరాల లో ముఖ్యమంత్రి హోదాలో కుటుంబ సమేతంగా ధర్మపురిలో పుష్కర స్నానం చేశారు.

రాష్ట్ర సాధన ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ధర్మపురి  శ్రీ లక్ష్మీనరసింహస్వామి పట్ల నాకు ఎనలేని నమ్మకం, విశ్వాసం ఉందని మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాల్లో బహిరంగంగా చెప్పేవారు.