మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డిలు ఇచ్చే సమాచారమే అధికారికం !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..


J.SURENDER KUMAR,

మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి లు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ అధికారిక సమాచారం అందించడానికి, పాలనా పరమైన నిర్ణయాలు వెల్లడించే బాధ్యతలను ఇకనుంచి మంత్రులు దుద్చిళ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల కు అప్పగించినట్టు ముఖ్యమంత్రి వివరించారు.


మంత్రివర్గ క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాదులో శుక్రవారం ఉపముఖ్యమంత్రి తో పాటు మంత్రివర్గ సభ్యులు అందరితో మీడియా సమావేశంలో మాట్లాడారు.


👉మీడియా సమావేశంలో సీఎం మాటలు..

👉వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఒకే సారీ ₹ 2 లక్షల రుణమాఫీ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. 12/12/2018 నుంచి 9/12/2023 మధ్య ఐదేళ్ల కాలంలో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసిందన్నారు.


👉రుణమాఫీ కోసం దాదాపు ₹ 31 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేయడం జరిగింది. గత ప్రభుత్వం తేదీ 11/12/2018 కటాఫ్ మేరకు విడతల వారిగా రుణమాఫీ చేసిందని ముఖ్యమంత్రి వివరించారు.


👉 రైతు భరోసా విషయంలో రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారన్న చర్చ జరుగుతోందని, ఆ కారణంగా ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘం నియమించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.


👉ఈ ఉప సంఘం జూలై 15 లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని తెలిపారు. ఉప సంఘం నివేదికపై శాసనసభలో చర్చించి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అందజేస్తామని తెలిపారు.