👉ఉత్తర తెలంగాణలో సంచలనం!
J.SURENDER KUMAR,
నాలుగున్నర దశాబ్దాల క్రితం కొన్ని నెలల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో అక్షరజ్ఞానం ఉన్న ప్రతివాడు, ఈనాడు పత్రికలో ప్రతి అక్షరం చదివేవారు. అక్షరజ్ఞానం లేనివారు కూడా ఆ పత్రికను చదివించుకుని వినేవారు. 1978 -79 లో ఈనాడు దినపత్రిక ఓ సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ప్రాణభయంతో భయాందోళన చెందుతున్న ప్రజలకు.. ఈనాడు పత్రికలో ప్రచురితమైతున్న వార్తలు, కథనాలను నాడు నమ్మేవారు. ఆ పత్రిక రాక కోసం తెల్లవారుజామునే పేపర్ ఏజెంట్ల వద్దకు ప్రజలు పరుగులు పెట్టేవారు. అది అక్షర యోధుడు స్వర్గీయ రామోజీరావు సారధ్యంలోనీ ఈనాడు దినపత్రిక కు ఉన్న నాటి విశ్వసనీయత.. ఘనత, చరిత్ర, గా చెప్పుకోవచ్చు.

👉ఇది కారణం….
కోవిడ్ – 19 మహమ్మారి ప్రపంచ జనావళిని ఎంతటి భయాందోళనకు గురిచేసిందో.. అంతకు రెట్టింపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలను స్కైలాబ్ వార్త అంతలా అతలాకుతలం చేసిందనేది అక్షర సత్యం.
👉స్కైలాబ్ వార్తలు..
సాంకేతిక తప్పిదనంతో అంతరిక్ష కేంద్రం నుంచి స్కైలాబ్ అనే గ్రహం కూలిపోతుంది అని శాస్త్రవేత్తల భావిస్తున్నారు, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూలిపోయే అవకాశం ఉందనేది ఈనాడు దినపత్రిక వరుస వార్త కథనాల సారాంశం.
👉సైలాబ్ అంటే?
టీవీ చానెళ్లు, సోషల్ మీడియా అప్పట్లో లేవు. కేవలం దిన పత్రికలు, రేడియోలో వచ్చే వార్తల నే ప్రజలు ఎక్కువగా చదివేవారు, వినేవారు. ఆ నోట ఈ నోట వచ్చే సమాచారాన్ని ప్రజలు గ్రామాల్లో గుంపులు గుంపులుగా చేరి అదే నిజమనుకుని నమ్మేవాళ్లు. ‘స్కైలాబ్’ విషయంలో కూడా అదే జరిగింది. స్కైలాబ్ తొలుత సముద్రంలో కూలిపోతుందని, ఆ తర్వాత అది భూమి వైపుకు దూసుకొస్తోంద ని, అది పడిన చోట భారీ విధ్వంసం తప్పదనే ప్రచారం జరిగింది. ఎప్పుడూ. చూసిన ఇవే వార్తలు. కొందరు తమకు తెలిసిన సమాచారానికి.. తెలియని అంచనాలు, భయాన్ని జోడించి ప్రచారం చేస్తూ ఆందోళన రెట్టింపు చేశారు. దీంతో చాలామంది ఇవే తమ ఆఖరి క్షణాలని భయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్ నుంచి ఏపీలో తీర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ‘స్కైలాబ్’ కూలే ప్రమాదం ఉందంటూ పత్రికలో వచ్చిన కథనాలు ప్రజలను మరింత భయపెట్టింది. ఎలాగో చనిపోతామని అధిక శాతం ప్రజలు విందులు వినోదాల్లో తేలిపోయారు. బంధువులు ఒకరినొకరు పరామర్శించుకునేవారు. స్థానిక ఆలయాలలో భజనలు చేసేవారు. మరికొందరు పుణ్యక్షేత్రాలకు పిల్లాపాపలతో వెళ్లేవారు. ఎలాగో మరణం తప్పదని కుటుంబాలు ఉమ్మడిగా వంటలు, భోజనాలు చేసి సమిష్టిగా ఓకే ఇంటిలో నిద్రించేవారు. స్కైలాబ్ భయం లో కొన్ని సంఘటనలు మాత్రమే ఇవి.
👉స్కైలాబ్
USA మొట్ట మొదటి అంతరిక్ష కేంద్రం ,NASA ద్వారా మే 1973, న అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. స్కైలాబ్ సాంకేతిక లోపం వల్ల క్షీణించి భూ మండలంపై కూలిపోతుందని నాడు బీబీసీ కథనాలు ప్రసారం చేసింది. ఇది జూలై 11, 1979 న హిందూ మహా సముద్రంలో కూలిపోయింది. పశ్చిమ ఆస్ట్రేలియా అంతటా శిధిలాలు పడ్డాయి.
👉ముఖ్య మంత్రి ధర్మపురి కి వచ్చాడు..
స్కైలాబ్ కూలిపోయి ప్రాణాలు పోతాయని భయాందోళన చెందుతున్న ప్రజలకు, ధైర్యం కల్పించడానికి నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 1979 లో ధర్మపురి కి వచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రజలతో సభను ఏర్పాటు చేశారు. స్కైలాబ్ మన తెలంగాణ ప్రాంతంలో, రాష్ట్రంలో దేశంలో కూలిపోదని, మీరు నిర్భయంగా ఉండండి. మీకు ధైర్యం కల్పించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అంటూ స్కైలాబ్ పట్ల ప్రజల ఆందోళన తొలగించే ప్రయత్నం చేశారు.
కొన్ని నెలలపాటు ఎవరి నోట విన్న ఇదే వార్త స్కైలాబ్ నిజాంబాద్ లో కూడిపోతుందని, కరీంనగర్ లో.అని కొందరు, ఆదిలాబాద్ లో అని మరికొందరు చర్చలు ఈనాడు పత్రిక ను గ్రామ చావళ్లలో ఇళ్లల్లో వార్తా కథనాలను పలువురు చదివి వినిపించే వారు.
స్వర్గీయ రామోజీ రావు సారథ్యంలో నాటి ఈనాడు పత్రిక స్కైలాబ్ వార్త కథనాలు ఓ సంచలనం, సృష్టించిందనేది అక్షర సత్యం.