నన్ను భాగస్వామ్యం చేయడం సంతోషం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రభుత్వ పాఠశాలలలో అడ్మిషన్లు పెంపొందించడానికి దాతల సహాయ సహకారాలకు వేలాది రూపాయల విలువ గల బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ధర్మపురి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు ప్రోత్సహించడానికి, పేద విద్యార్థులకు సహాయం చేయడానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, వాసవి క్లబ్ మంచిర్యాల మరియు ఇతర దాతల సౌజన్యంతో శనివారం ఏర్పాటు చేసిన స్కూలు బ్యాగులు మరియు నోట్ బుక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..


50 వేల రూపాయల విలువ గల 100 స్కూల్ బ్యాగ్స్ ,నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమంలో తనను భాగస్వాములను చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల కృషిని, వాసవి క్లబ్ వారి సేవలను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని అన్నారు. నియోజక వర్గంలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తమని, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


👉జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష !


ధర్మపురిలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్స్ తో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్బంగా ప్రభుత్వ స్కూల్ లో వసతులు, అడ్మిషన్లు, బోజన సదుపాయం వంటి పలు అంశాలపై వారితో చర్చించారు.

ప్రభుత్వ పాఠశాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ఈ సందర్భంగా వారికి సూచించారు.