ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది!

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు పై రైతులకు చేయూతనిస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జగిత్యాల జిల్లా మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆద్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతు అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని, ఇటీవల జరిగిన వడ్ల కొనుగోలు విషయంలో ఎక్కడ రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం కొనుగోళ్లు పూర్తి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.