పదవీ విరమణ పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తిదాయకం !

👉ఎస్పీ  అశోక్ కుమార్ !


J.SURENDER KUMAR,

విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న పోలీస్ అధికారులు చంద్రశేఖర్, కరుణాకర్, అంజయ్య, సేవలు స్ఫూర్తిదాయకమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.

శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఎస్పీ  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందచేశారు.

  ఎస్పీ  మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు.  ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని  అన్నారు. 

పదవి విరమణ అనంతరం  కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని  ఎస్పీ ఆకాంక్షినారు.


ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (AR) భీమ్ రావు , డిఎస్పీ రఘు చందర్ , R I వేణు, R S I లు కృష్ణ   పాల్గొన్నారు.