👉 కలెక్టర్ షేక్ యష్మీన్ భాష వీడ్కోలు సమావేశంలో..
👉ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్ పక్షపాతం లేకుండా, మేము ప్రతిపక్షంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆమె చేసిన కృషి అభినందనీయమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష,
మరియు అడిషనల్ కలెక్టర్ దివాకర్ బదిలీ పై వెళ్తున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నరసింహారావు లు పాల్గొన్నారు.

ముందు గా జిల్లా నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యప్రసాద్ ను కలెక్టర్ కార్యాలయంలో లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

జిల్లా నూతన కలెక్టర్ సత్య ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామనీ, బదిలీపై వెళ్తున్న షేక్ యష్మీన్ భాష, అదే విధంగా దివాకర ఇద్దరు వారి వారి విధి నిర్వహణ చిత్తశుద్దితో నిర్వర్తించే వారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.

యష్మిన్ భాష మతాలకు అతీతంగా ధర్మపురిలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందని, మేము ప్రతి పక్షంలో ఉన్నపుడు గాని, అధికారం లోకి వచ్చినపుడు గాని ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే వారు స్పందించి అట్టి సమస్యల పైన తగు చర్యలు తీసుకున్నారని అన్నారు.
వారు ఎక్కడ విధులు నిర్వహించిన వారికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి , ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సంధర్బంగా వక్తలు తమ తమ ప్రసంగాలలో పేర్కొన్నారు.