👉 కెమెరా పరిభాషలో ఛాయాచిత్ర యంత్ర దేవికి వినూత్నంగా అంగపూజ అష్టోత్తర శతనామార్చనలు.
👉 ఛాయాచిత్ర యంత్ర దేవి చిత్రపట రూపకర్త …ప్రత్యేక పూజ విధానం రూపొందించిన ధర్మపురి ఫోటోగ్రాఫర్ .
J.SURENDER KUMAR,
కెమెరాని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న ఫోటోగ్రాఫర్లకు కెమెరా డే ఒక పండగ, ఓ పర్వదినం, ఆ దినాన్ని భక్తిశ్రద్ధలతో, పవిత్రంగా, పూజాది కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్న సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శనివారం జరిగింది.
👉వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రపంచ కెమెరా దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ల సంక్షేమార్తం ఛాయాచిత్ర యంత్రదేవి ప్రీత్యర్థం సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. .

ధర్మపురి కి చెందిన వడ్లూరి రవీందర్(రాష్ట్రస్థాయి ప్రముఖ ఫోటోగ్రాఫర్) తన ఆలోచనలతో ఛాయాచిత్ర యంత్ర దేవి చిత్రపటానికి రూపకల్పన చేసినాడు. ఛాయాచిత్ర దేవి ప్రత్యేక పూజ విధానాన్ని కెమెరా పరిభాషలో తానే స్వయంగా రచించి పూజించారు. అంగ పూజ నుండి మంత్రపుష్పం, అభిషేకం వరకు కెమెరా పరిభాషలోనే నామార్చన చేసి ప్రత్యేకంగా ఛాయాచిత్ర యంత్ర దేవికి పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు.
గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి కెమెరా దినోత్సవం రోజున ఒక ప్రత్యేకత ప్రపంచ కెమెరా దినోత్సవం నిర్వహించుకుంటున్నట్లు రవీందర్ తెలిపాడు.
