J.SURENDER KUMAR,
2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్
సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై భారీ ఓట్ల మెజార్టీతో
విజయం సాధించిన ధర్మపురి ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్లూరి
లక్ష్మణ్ కుమార్, రాజకీయ ప్రతీకార చర్యలకు ఆమడ
దూరంలో ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల, రాజకీయ విశ్లేషకుల
ఊహాగానాలకు అంతు చిక్కడం లేదు.
ఏపీ లో 2019 నుంచి 2024 జూన్ వరకు అధికారంలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి అధికారం అస్తగతం చేసుకున్న విషయం తెలిసింది. బుధవారం ( ఈనెల 12 న ) చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏపీలో వైఎస్ఆర్సిపి నాయకుల పై, వారి ఇళ్లపై, పార్టీ ఆఫీసులపై దాడులు, విధ్వంసంలు, కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఏపీలో పలువురు అధికారులు సెలవుల పై వెళుతున్నారు, ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సెలవు పెట్టీ వెళ్ళిపోయారు అంటే, రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియడానికి ఇవి కొన్ని ఉదంతాలు మాత్రమే.
👉కేసిఆర్ ప్రభుత్వంలో..
పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకుల, కార్యకర్తల ను, ప్రజాప్రతినిధులను నాటి ప్రభుత్వం వేధించిన, నష్టపరిచిన, అక్రమ కేసులు పెట్టి, జైల్ కు పంపడం, రోడ్డు వెడల్పు కార్యక్రమాల పేరిట ఇళ్లను కూల్చడం, ప్రకృతి వనం పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కోవడం, ధరణి అడ్డుపెట్టుకొని ఇబ్బందులకు గురి చేయడం, ప్రధానంగా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, మున్సిపల్, పంచాయతీ రాజ్, తదితర కార్యాలయాల్లో చోట మోట గులాబి నాయకుల దే ఇష్ట రాజ్యాంగా గ్రామీణుల ,ప్రతిపక్ష నాయకుల పై అధికారం చలాయించి, వేధించిన తీరు లాంటి ఉదంతాలు కొన్ని మాత్రమే.
2023 లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా , ఏపీలో జరుగుతున్న లాంటి సంఘటనలు, విధ్వంసాలు, దాడులు, ఆస్తి నష్టం మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరగలేదనేది జగమెరిగిన సత్యం.
👉ఎమ్మెల్యేను వేధించిన తీరు..

అయితే ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ప్రతీకార రాజకీయ చర్యలకు ఆమడ దూరంలో ఉన్నారు అనడానికి గత దశాబ్ద కాలంగా లక్ష్మణ్ కుమార్ కు, ఆయన అనుచరులకు, జరిగిన అవమానాలు, ఆస్తి నష్టాలు, అక్రమ కేసుల నేపథ్యంలో ప్రస్తుతం అధికార పవర్ లో ఉండి, కనుసైగలతో రాజకీయ ప్రతీ కార చర్యలను శాసించే ఆచ్చి వచ్చిన అవకాశాలు ఉన్న లక్ష్మణ్ కుమార్, అలాంటి చర్యలకు ఆమడ దూరంలో ఉండడం, అధికార, ప్రతిపక్ష పార్టీలలో సైతం చర్చ కు అవకాశం ఏర్పడింది.
👉వివరాల్లోకి వెళితే..
2006 లో ధర్మారం జెడ్పిటిసి సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు నిర్వహించారు. 2009 లో నూతనంగా ఆవిర్భవించిన (రిజ్వరుడు) ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. వరుసగా 2011, 2014.2018, వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేస్తూ ఓటమి చెందిన లక్ష్మణ్ కుమార్. ధర్మపురి నియోజకవర్గాన్ని దశాబ్దాల కాలంగా అంటి పేట్టుకొని ఉన్నారు.
సాగు, తాగునీటి, వైద్య, విద్య సమస్యలు, రైతాంగ సమస్యలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట క్వింటాల్ కు 8 కిలోలు అధికంగా తూకం రైతులను, రైస్ మిల్లర్లు, ఐకెపి కేంద్రాల నిర్వహకులు దోచుకోవడం, తదితర అంశాల పై నిరసనలు, ధర్నాలు, వెల్గటూర్ మండల ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇత్తనాల ఫ్యాక్టరీ రద్దు , కోసం ప్రజలతో రాస్తా రోఖోలు, గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు నమోదు చేయడం, తదితర సమస్యలపై చేపట్టిన ఆందోళన కెసిఆర్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఆయన అనుచర వర్గం, వేధించి ఇబ్బందులకు గురి చేసిన తీరు , కాంగ్రెస్ శ్రేణులు అనుభవించిన అవమానాలు, వర్ణనాతీతం.
గత ప్రభుత్వంలో గొల్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చెక్ పవర్ రద్దుచేసి సస్పెండ్ చేశారు. బుగ్గారం మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కుటుంబానికి చెందిన (గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన) అసైన్డ్ వ్యవసాయ భూమి నీ ,పల్లె ప్రకృతి వనం’ కోసం పోలీస్ బలగాలతో ఆ కుటుంబాన్ని వేధించి లాక్కున్నారు. తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాడని, ప్రముఖ పత్రికకు చెందిన జర్నలిస్టు పై మరో పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదు చేసి వేధించారు. వేధించడమే కాకుండా, పత్రికా యాజమాన్యానికి ఫిర్యాదు చేసి జర్నలిస్టును ఆ పత్రిక నుంచి తొలగించారు.
2018 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ , గెలుపు కోసం ప్రచారం చేశారని. మాస్టర్ ప్లాన్ లేకుండా, ధర్మపురి పట్టణంలో రోడ్డు వెడల్పు అంటూ ఇంటి ప్రహరీ గోడలను, దుకాణాలను జెసిబి యంత్రాలతో కూల్చి వేస్తూ పలువురు కాంగ్రెస్ శ్రేణులకు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం కలిగించారు.
సోషల్ మీడియాలో నాటి స్థానిక ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ పోలీస్ స్టేషన్ ల లో కేసు నమోదు చేసి వారిని చిత్రహింసలకు గురి చేశారు. కాలేశ్వరం రిజర్వాయర్ లింక్ టు పేరిట. ఎకరం దాదాపు ₹18 లక్షలు విలువచేసే వ్యవసాయ భూములను పోలీస్ బలగాలతో రైతుల నుండి నిర్బంధంగా లాక్కొని ఎకరానికి గరిష్టంగా ₹ 8 లక్షలు చెల్లించారు. రైతుల కన్నీటి రోదనలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అరణ్య రోదనలుగా మారింది, మినహా రైతులకు న్యాయం జరగలేదు. నియోజకవర్గంలో ఇలాంటివి కొన్ని మచ్చుతునకలు మాత్రమే.
ఇదిలా ఉండగా అధికార పార్టీ ( బీఆర్ఎస్ ) కు చెందిన దళిత మహిళ సర్పంచ్, పంచాయతీ ద్వారా చేసిన పనులకు బిల్లులు రావడం లేదు అని ప్రభుత్వంలో కదలిక కోసం జిల్లా పంచాయతీ అధికారికి రాజీనామా లేఖ ఇచ్చింది. అదే అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒత్తిడితో రాజీనామాను 24 గంటల్లో అధికారులు ఆమోదించారు. ప్రజాస్వామ్యవాదులు, స్పందించి దళిత మహిళా సర్పంచ్ కు అండగా నిలిచి హైకోర్టును ఆశ్రయించి ఆమెను తిరిగి సర్పంచ్ పదవిలో కొనసాగేలా కలెక్టర్ కు ఆదేశాలు ఇప్పించారు.
👉ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్లు గెలిచారు !
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా విజయం సాధించి, ప్రభుత్వ విప్ గా గత కొన్ని నెలలుగా కొనసాగుతున్నారు. రాజకీయంగా నష్టపోయిన కాంగ్రెస్ శ్రేణులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులపై అవిశ్వాస తీర్మానాలకు,. క్యాంపు రాజకీయాలకు ఎమ్మెల్యే పై ఒత్తిడి చేసినా, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ , తన శ్రేణులకు వాళ్లు ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచారు. అవిశ్వాసంతో వారిని గద్దించడం తగదు, అంటూ బుజ్జగిస్తున్నట్టు చర్చ.
కొన్ని నెలలు ఓపిక పట్టండి , స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు చైర్మన్లు, సింగిల్ విండో లు మనమే గెలుస్తాం. అంటూ సముదాయిస్తు, అధికారంలో అడ్డుపెట్టుకొని నియోజకవర్గం అభివృద్ధి చేద్దాం, అంటూ తన శ్రేణులకు ఎమ్మెల్యే వివరిస్తున్నట్టు నియోజకవర్గంలో చర్చ. ఇది ఇలా ఉండగా ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వం నుంచి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయించిన దాదాపు ₹ 50 కోట్ల పనులను మండలాల వారిగా తన వెన్నంటి ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు అప్పగించినట్లు చర్చ.
ఇది ఇలా ఉండగా ధర్మారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ, సోషల్ మీడియా క్రియాశీల నాయకుడిపై తప్పుడు కేసులు నమోదు చేసి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ జైలుకు పంపించారంటూ మాజీ సీఎం కెసిఆర్ ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరోపణలకు, అక్కడ క్షేత్రస్థాయిలో జరిగిన సంఘటనలు ,వాస్తవాలు మరోలా ఉన్నాయని అనేది చర్చ.
గత డిసెంబర్ 7 నుంచి ఆరు నెలల కాలంలో జూన్ 12 నాటి వరకు నియోజకవర్గంలో 90 శాతం టిఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ లు, సింగిల్ విండో చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ లపై కొనసాగుతున్న ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఆయన అనుచర గణం వారిపై అవిశ్వాస తీర్మానాలకు , రాజకీయ సమీకరణాలకు ప్రయత్నాలు చేయకపోవడం, స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాస్వామిక విలువలకు ప్రత్యక్ష నిదర్శనంగా అనే చర్చ జరుగుతున్నది.