రామోజీరావు కోసం మొక్కని దేవుడు లేడు చేయని పూజలు లేవు !

J.SURENDER KUMAR,


పత్రికా రంగం దిగ్గజం అక్షర యోధుడు, స్వర్గీయ రామోజీరావు

ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు, రామోజీ గ్రూప్ సంస్థల

అధిపతులు గత కొన్ని నెలలుగా మొక్కని దేవుడు లేడు,

చేయని పూజలు లేవు.

పత్రిక రంగంలో నూతన ఒరవడి సృష్టించి, నాలుగు దశాబ్దాలుగా వాస్తవాలను వెలికితీస్తూ, సమాజానికి సేవలు అందిస్తూ అమరుడైన అక్షర యోధుడు స్వర్గీయ రామోజీరావు గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది.

రచయితగా, సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసుకున్నా, పాత్రికేయుడిగా, నిర్మాతగా పత్రిక, టీవీ రంగాల్లో విప్లవాత్మక మార్పులతో ప్రజల గొంతుక గా నిలిచిన రామోజీరావు. ఫిబ్రవరి మొదటి వారంలో తీవ్ర అస్వస్థతకు గురి అయినట్టు తెలిసింది. అత్యాధునిక వైద్యంతోపాటు ప్రత్యేక వైద్య నిపుణులు 24/7 గంటలపాటు సేవలందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కినట్టు సమాచారం.


స్వర్గీయ రామోజీరావు కుటుంబ నేపథ్యం శ్రీ వైష్ణవ సాంప్రదాయ పద్ధతులను పాటిస్తున్న
నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని ప్రముఖ, పవిత్ర పుణ్యక్షేత్రాలలోనీ ఆలయాలలో, శక్తిపీఠాలు ,జ్యోతిర్లింగాలలో ‘ గరిమెళ్ళ గోత్రం, చెరుకూరి రామోజీరావు, చెరుకూరి రమాదేవి, చెరుకూరి పూర్ణ సుజయ్ , చెరుకూరి విజయేశ్వరి పేరిట, మహా రుద్రాభిషేకాలు, అర్చనలు, నిత్య కళ్యాణం, ప్రత్యేక పూజలు హోమాధి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, గ్రూప్ సంస్థల అధిపతులు చేయించినట్టు తెలిసింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి, కొండగట్టు, వేములవాడ క్షేత్రాలతో పాటు రాష్ట్రంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు రామోజీరావు కుటుంబం పేరిట పూజలు చేయించినట్లు తెలిసింది.

ఆలయాలకు సంబంధించిన ప్రతి పూజకు నిర్దేశించిన సొమ్ము ను సంబంధిత ఆలయాలకు ముందస్తుగా చెల్లించి, అర్చకులు, వేద పండితులతో వారు చేయించారు. చిన్న పాటీ హోదా పవర్ ను అడ్డుపెట్టుకొని కొందరు చోటా మోటా నాయకులు తమ అభిమాన నేత పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భాల లో పైసా చెల్లించకుండా ఆలయాల్లో ఆర్భాటంగా పూజలు చేయించడం, ఆ దృశ్యాలను ప్రచార సాధనాల్లో ప్రచారం చేసుకోవడం మినహా అనేక ఆలయాలకు నయా పైసా చెల్లించని ఉదాంతాలు అనేకం.

ప్రపంచం సినీ జగత్తుకు, పత్రికా ప్రపంచానికి, దిగ్గజం లాంటి స్వర్గీయ రామోజీరావు, కుటుంబ సభ్యులు, ఈనాడు గ్రూపు సంస్థల అధినేతలు, ముందస్తుగా డబ్బులు చెల్లించి రామోజీరావు ఆరోగ్యం కోసం పూజాది కార్యక్రమాలు చేయించిన తీరును, పలువురు ప్రశంసిస్తున్నారు, వారి చర్యలను అభినందిస్తున్నారు.