J.SURENDER KUMAR,
చేసే పనిలో అంకిత భావంతో నిర్వహిస్తే గుర్తింపు గౌరవం దానంతట అదే వస్తుందనేది జగమెరిగిన సత్యం,
దీనికి నిదర్శనమే ధర్మపురి 108 అంబులెన్స్ లో విధులు నిర్వర్తిస్తున్న పైలెట్ బత్తిని సంపత్ ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీస్ లో సీనియర్ పైలట్ గా విధులు నిర్వహిస్తూ సకాలం లో రోగులను ఆసుపత్రికి చేరుస్తూ,వాహన మెయింటనెన్స్, మైలేజి తదితర అంశాలలో ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయిలో స్టార్ పైలట్ గా ఎంపికై గురువారం కరీంనగర్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డా.సుజాత, ఈఏం ఆర్ఐ అధికారి ఎం.రవికుమార్, ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం ల సంపత్ కు ఉత్తమ రాష్ట్ర స్తాయి పైలట్ అవార్డును ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం డిపివో రవీందర్,ఉమ్మడి జిల్లాల 108 కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.