J.SURENDER KUMAR,
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విధాన సభకు వెళ్లి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు చర్చ. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా నెలకొన్న రాజకీయ వివాదం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక విషయం తెలిసిందే.
జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్న డిప్యూటీ సీఎం!

హైదరాబాదులోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేరుకొని జీవన్ రెడ్డి నీ బుజ్జగిస్తున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్జీ పదవికినామా చేస్తున్నాను అనే స్పష్టం చేసినట్టు సమాచారం.
ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలోనూ ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మంత్రి శ్రీధర్ బాబు, సోమవారం సాయంత్రం హుటాహుటిన జగిత్యాలకు వచ్చి జీవన్ రెడ్డి నీ సముదాయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మంత్రితో పాటు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ తదితరులు జీవన్ రెడ్డినీ సోమవారం ఉదయం నుంచి సముదాయించడానికి విశ్వ ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.

సోమవారం అర్ధరాత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన అంతరంగీకులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చర్చల అనంతరం జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున వేలాది మంది అనుచరుల కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు హైదరాబాద్కు తరలి వెళ్లారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవికి మాత్రమే ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. అనంతరం గాంధీభవన్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.