J. SURENDER KUMAR,
ఢిల్లీలోనీ తెలంగాణ భవన్ లో శుక్రవారం స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ, మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ , తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు తమ తమ ప్రసంగాలలో పీ వీ గూర్చి స్థిత ప్రజ్ఞుడు, బహు భాషాకోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, భారతరత్న స్వర్గీయ పీవీ నరసింహారావు, దేశానికి అందించిన సేవల గూర్చి కొనియాడారు.