J.SURENDER KUMAR,
తెలంగాణ లో పరిశ్రమల నెలకొల్పడానికి తగిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం చూపించినట్లైతే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ స్పష్టం చేశారు.
డిల్లి పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ మర్యాద పూర్వకంగా కలసి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాట్లు గూర్చి చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను నెలకోల్పాలని దానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రికి వివరించారు. స్పందించిన కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ తన శాఖ అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.