తిరుమలలో  పోటెత్తిన భక్తజనం !

J.SURENDER KUMAR,


తిరుమల శ్రీవారి దర్శనం కోసం  కొండపై భక్తజనం పోటెత్తారు.  కిలోమీటర్ల పొడవు భక్తజనం క్యూ లైన్ విస్తరించింది. జూన్ 17 వరకు వరుసగా సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల తో తిరుమల కొండ నిండిపోయింది. మొత్తం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక  బయట వరకు క్యూ లైన్  యాత్రికులతో విస్తరించింది.

గురువారం నుంచి యాత్రికుల తాకిడి మొదలైంది.  సోమవారం  సెలవు దినం కావడంతో ఇదే  రద్దీ కొనసాగుతుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీవారి సేవకుల సహకారంతో  క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, నీటిని, టీటీడీ నిరంతరం పంపిణీ చేస్తోంది.

టిటిడి జెఈవో  వీరబ్రహ్మం వ్యక్తిగత పర్యవేక్షణలో సీనియర్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, అన్నప్రసాదం, నీటి పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ టిటిడి నిరంతరం భక్తుల రద్దీని పర్యవేక్షిస్తున్నారు.


సీనియర్‌ అధికారుల్లో ఎస్ఈ2  జగదీశ్వర్‌రెడ్డి, వాటర్‌ వర్క్స్‌ ఈఈ  శ్రీహరి, చీఫ్‌ పీఆర్‌వో డాక్టర్‌ రవి, కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌  శ్రీనివాసులు, డీవైఈవో అన్నప్రసాదం  రాజేంద్ర, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీదేవి, ఏవీఎస్‌వో  సత్యసాయి గిరిధర్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. .