.👉నేడు బంకిమ్ చంద్ర చటర్జీ జయంతి !
***
ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర ఛటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగాలీ సాహిత్యాన్నే కాకుండా.. భారతీయ సాహిత్యాలను ఆయన ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేశారు. ఒక మహా కవి రచించిన దేశభక్తి గీతం ప్రజలను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన భారత దేశ స్వతత్ర్యోద్యమంలో తప్ప మరో చోట ఎక్కడా సంభవించలేదు.
భారతదేశ స్వతంత్ర ఉద్యమం చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం వేగాన్ని మరింత పెంచింది.ఈ గీతం ఆయన రచించిన ఆనంద్ మఠ్ అనే నవల నుండి గ్రహించబడింది.
ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యానికి చెందినవే అయినా.. సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం.
నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యానరచనలో బంకించంద్రఛటర్జీ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించారు.బంకిం చంద్ర చటోపాధ్యాయ జూన్ 27, 1838న నైహతిలోని కంఠల్‌పురా గ్రామంలో జాదబ్ చంద్ర చటోపాధ్యాయ మరియు దుర్గాదేబి దంపతులకు ముగ్గురు సోదరులలో చిన్నవానిగా జన్మించారు.
బంకిం చంద్రచటర్జీ రచించిన వందేమాతర గీతం స్వాతంత్ర్య పోరాటంలో ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చింది. వందేమాతర ఉద్యమం బెంగాల్‌కు పరిమితం కాకుండా దేశవ్యాప్తమైంది. మొదట్లో ఈ ఉద్యమం సురేంద్రనాథ్ బెనర్జీ వంటి మితవాదుల నేతృత్వంలో జరిగినా క్రమంగా అతివాద, తీవ్రవాద నాయకత్వానికి మరలింది.
ఈ ఉద్యమాన్ని బెంగాల్ నుంచి దేశవాప్తంగా ప్రచారం చేయడంలో బిపిన్ చంద్రపాల్ ప్రముఖ పాత్ర పోషించారు. మద్రాస్, ఆంధ్ర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ ఉద్యమ కాలంలోనే ట్యుటికోరిన్ లో స్వదేశీ స్టీమ్ నేవిగేషన్ కంపెనీని స్థాపించారు. అక్కడ ఈ ఉద్యమాన్ని సుబ్రమణ్య అయ్యర్, చిదంబర పిైళ్లె విస్తృతం చేశారు. ఆంధ్ర ప్రాంతంలో కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు నేతృత్వం వహించారు. పంజాబ్‌లో భగత్‌సింగ్ మేనమామ అజిత్ సింగ్ అంజుమాన్ మెహబత్ వాటన్ అనే సంస్థను, భారతమాత అనే పత్రికను నడిపి ఉద్యమాన్ని విస్తరించారు.
బంకిమ్ “భారతదేశంలో ఆధునిక నవల పితామహుడు”గా పరిగణించబడ్డారు . అతను బెంగాలీలో చారిత్రక మరియు సామాజిక నవలలు వ్రాసిన మొదటి వ్యక్తి కాదు, కానీ అతను నవలని భారతదేశంలో ఒక ప్రధాన సాహిత్య శైలిగా స్థాపించారు.ఆయన 1894 ఏప్రిల్ 8న తుదిశ్వాస విడిచారు.
వ్యాసకర్త : యం. రాం ప్రదీప్, తిరువూరు
మొబైల్ ; 9492712836