విద్య రంగానికి సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు !

👉ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


సీఎం రేవంత్ రెడ్డి విద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తూ,ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం కేంద్రంలో ZPHS పాఠశాలలో బుధవారం రోజున నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రైవేటుకు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యహ్నం భోజనంతో పాటు, టెక్స్ట్ బుక్స్,యునిఫామ్స్ తో పాటు స్కాలర్‌షిప్‌లు ఉండే అవకాశం ఉందన్నారు

తాను ఈ పాఠశాలను మొదటి సారి సందర్శించినప్పుడు హెడ్మాస్టర్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, విద్యార్థులకు తాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించినట్టు ఎమ్మెల్యే అన్నారు. తాను ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే పాఠశాలకు బొర్ వేల్ మంజూరు చేశామన్నారు. నియోజక వర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామని, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుమార్ వివరించారుజగిత్యాల జిల్లాలో విద్య రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అని అన్నారు.