J.SURENDER KUMAR,
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తీరును మాజీ సీఎం కెసిఆర్ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అందుబాటులో ఉన్న కీలక నాయకులతో మంగళవారం కెసిఆర్ ఫామ్ హౌస్ లో తాజా రాజకీయాలు, ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపులు తదితర అంశాలపై సమీక్షించిన విషయం తెలిసిందే. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం మేరకు…
కెసిఆర్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ…
👉జీవన్ రెడ్డి సంగతి చూశారా, ఆ పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే, ఉద్యమ సమయంలో నాపై రెండుసార్లు పోటీ చేసిండు…
👉40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తాండు…
👉10 సంవత్సరాల మన ప్రభుత్వం ఎంఎల్ఏ గా, ఎమ్మెల్సీగా ఆ పార్టీ తరపున పోరాడిండు.
👉ఆయనకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఇంట్లో కట్టే కుర్చీలు, పంక ( ఫ్యాన్ )
👉అందులో కి పోయి ( కాంగ్రెస్ పార్టీలోకి ) కొందరు ఏదో చేస్తామంటే అక్కడ ఏం లేదు. మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు..
👉వాళ్ల దాంట్లో వాళ్లకే పడతలేదు, ఏడాది ఓపిక పట్టండి. అంటూ మాజీ సీఎం కేసీఆర్ జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై మాట్లాడినట్టు సమాచారం…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీపీ పలువురు సర్పంచులు ఫామ్ హౌస్ ప్రాంగణంలో ఉన్న వారికి సమావేశంలో పాల్గొనడానికి అనుమతి నిరాకరించినట్టు తెలిసింది.