👉 ధర్మపురి ఆలయానికి ఆరు సంవత్సరాలుగా ఇంచార్జ్ ఈవోల పాలన !
👉 అదనపు బాధ్యతలతో ఆలయ ఆదాయానికి నష్టం !
👉 బదిలీ చేయడానికి భయపడుతున్న అధికార యంత్రాంగం
J.SURENDER KUMAR,
కెసిఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి వచ్చినా, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి
ఆలయనికి ఇంచార్జ్ ఈవో లు గా గత అరు సంవత్సరాలు
విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం
ఏర్పడిన ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారికి
అనుకూలంగా, అమృతతుల్యంగా మారుతున్నది. ప్రభుత్వం
మారిన, అధికార యంత్రాంగం ఇంచార్జ్ బాధ్యతలను
నిర్వహిస్తున్న అధికారిని తప్పించడానికి తర్జన బర్జన
పడుతున్నారా ?. భయపడుతున్నారా ? అనే విషయం
అంతుపట్టడం లేదు.
ఇంచార్జ్ అధికారుల చర్యలతో, ఆలయ ఆదాయానికి నష్టంతో పాటు, పర్యవేక్షణ కొరబడి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం లో కీలక నాయకుడి అండ దండలతో పాటు, చోటా,మోటా పింకీ నాయకుల హవా, ఆలయ నిర్వహణలో జోరుగా వీచింది. విధులను, నిధులను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తు ఆలయ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని, ఆ శాఖ డిప్యూటీ కమిషనర్, ప్రభుత్వానికి నివేదికలు పంపిన నేటికీ చర్యలు శూన్యం, వివరాల్లోకి వెళితే..
👉ఆరు సంవత్సరాలుగా ఇంచార్జ్ ఈవోలదే రాజ్యం !
సాలిన దాదాపు ₹ 5 కోట్ల కు పైగా ఆదాయం గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గత ఆరు సంవత్సరాల కాలంగా ఇంచార్జ్ ( కార్యనిర్వాహణాధికారుల ) పాలన నే నేటికీ కొనసాగుతున్నది.
👉 కెసిఆర్ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాలనలో 2014 డిసెంబర్ నుంచి 2018 జులై వరకు రెగ్యులర్ ఈవో గా సుప్రియ కొనసాగింది.
👉ఇంచార్జ్ లు !
- కొండగట్టు ఈవో సాయిబాబా, 25-07-2018 నుంచి 21-08-2018 వరకు
2) కొండగట్టు ఈవో అమరేందర్, 22-08-2018 నుంచి 10-08-2019 వరకు.
3) గూడెం ఈవో శ్రీనివాస్. 11-08-2019 నుంచి ఈరోజు వరకు కొనసాగుతున్నారు. ఈ ఆలయంతో పాటు. 1) బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 2) శ్రీ అక్క పెళ్లి రాజరాజేశ్వర స్వామి ఆలయం ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
👉 ఆలయాలకు రెగ్యులర్ ఈవోలు !
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన, బాసర అమ్మవారి ఆలయం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కాలేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయలకు రెగ్యులర్ ఈ .ఓ లు గా గత కొంతకాలం కొనసాగుతుండరు.
ఆ ఆలయాల జాబితాలో ప్రముఖ క్షేత్రంగా గుర్తింపు పొందిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి గత ఆరు సంవత్సరాలుగా ఇంచార్జ్ ఈవోలో పాలన మర్మమేమిటో ? గత ప్రభుత్వ రాజకీయ పెద్దలకే తెలిసి ఉంటుంది.
👉 ఆలయ ఆదాయానికి అపార నష్టం!
ధర్మపురి ఆలయ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులతో ప్రారంభించిన పలు పనులు సంవత్సర కాలంకు పైగా పనులు పూర్తి కావడం లేదు. కాంట్రాక్టర్ తో పనులు చేయించే సాహసం ఇంచార్జ్ ఈవో చేయలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తి పడిన కొందరు జాతీయ రహదారి శాఖ ఇంజనీరింగ్ అధికారుల అనుమతులు లేకుండా నే రాయపట్నం లో చౌరస్తాలో లక్షలాది రూపాయల నిధులతో స్వాగత తోరణం నిర్మాణం ( ఆర్చ్ గేట్ ) పిల్లర్లను నిర్మించారు. జాతీయ రహదారి అధికారులు అభ్యంతరం తెలపడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో ఆలయ ఖజానాకు లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది.
ఆలయ నిర్వహణ , నియామకాలలో సరిపడే సిబ్బంది ఉన్నప్పటికీ, గత ప్రభుత్వ రాజకీయ జోక్యంతో క్యాడర్ స్ట్రెంత్ కోసం ఇంచార్జ్ అధికారి అనేకసార్లు ఎండోమెంట్స్ కమీషనర్ కు లేఖలు రాశారు.



తాత్కాలిక ఉద్యోగుల నియామకాలు, ఓచర్ల పై చెల్లింపులు, లక్షలది రూపాయల దిట్టం సరుకుల, అధికంగా నిల్వలు , కమీషనర్ ఆదేశాలను పాటించకుండా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమించడం, రికార్డులలో సంతకాలు చేయించడం వారికి నేరుగా వేతనాలు చెల్లించడం . అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నుండి ఇన్వాయిస్ అడ్వాన్స్ స్టాంప్ రసీదు లేకున్నా, ఏజెన్సీకి హాజరు ధృవీకరణ పత్రాన్ని జారీ చేయడంలో నిర్లక్ష్యం. లేబర్ మరియు సెక్యూరిటీ గార్డ్‌ల అటెండెన్స్ రిజిస్టర్ మస్టర్ రోల్‌ను నిర్వహించడంలో నిర్లక్ష్యం, నాచుపల్లి శ్రీ ఆంజనేయ ఎంటర్‌ప్రైజెస్ లేబర్ & సెక్యూరిటీ గార్డ్‌లను ఎంగేజ్ చేసినందుకు చెల్లింపులు, ఏజెన్సీకి సంబంధించిన హాజరు, మస్టర్ రోల్ ఇన్‌వాయిస్ లేకుండా చెక్కులు జారీ చేస్తున్నారు.
ధర్మపురి ఆలయం 6 (ఎ ) పరిధిలో కి వస్తుంది. ప్రతి నగదు , చెక్కులు, చెల్లింపులలో ‘ ప్రీ ‘ ఆడిట్ తర్వాత మాత్రమే చెక్ ద్వారా చెల్లించాలి. ఆ నిబంధనలు పట్టించుకోకుండా, చెల్లింపులు, విత్‌డ్రాలు, డీజిల్ కొనుగోలు, కంప్యూటర్ నిర్వహణ, ధోబీలు, నాయీ బ్రాహ్మణులకు వేతనాలు చెల్లింపులలో ఇష్టారాజ్యం నడుస్తుంది .
నిత్య నివేదన రిజిస్టర్, అన్నదానం స్టాక్ రిజిస్టర్, పులిహోర స్టాక్ రిజిస్టర్, లడ్డూ స్టాక్ రిజిస్టర్, పూజా సమగ్రి స్టాక్ రిజిస్టర్, తదితర రిజిస్టర్లు పర్యవేక్షణ ఇన్చార్ ఈ ఓ ఇష్టారాజ్యం అనే చెప్పాలి.
ముందస్తు అనుమతి లేకుండా కొందరు వ్యక్తులను రోజువారీ వేతన ప్రాతిపదికన నియమించడం, వారికి ఆలయ నిధుల నుండి వేతనాలు చెల్లించడం, అది కూడా అటెండెన్స్ లేకుండా కార్మికుల మస్టర్ రోల్ నిబంధన పాటించ కుండా చెల్లింపులు.
రోజువారీ వేతనం కొందరు వ్యక్తుల పేర్లతో పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేయడం షరా మామూలుగా మారింది.
ముందస్తు అనుమతి లేకుండా బడ్జెట్‌ని ఒక హెడ్ నుండి మరొక హెడ్‌కి తిరిగి అప్పగించడం ఇక్కడి అధికారులకు అలవాటుగా మారింది.
👉వ్యయము 40 శాతం కు పైనే..,?
ఆలయ సాలిన ఆదాయంలో 30 శాతం లోపు మేరకు ఉద్యోగుల జీతాలు ( ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక ) పండుగల నిర్వహణ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆలయంలో దాదాపు 40 శాతం కు పైగా ఖర్చు చేస్తున్నట్లు రికార్డులలో నమోదయింది.
ఆదాయంలో 12 శాతం ఏ. సీ ల ఈవోల జీతభత్యాలకు, దేవాదాయ ఆర్థిక శాఖకు చెల్లించాలి. 15% గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు దేవదాయ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. లడ్డు, పులిహోర ప్రసాదాల అమ్మకాలు, అన్నదానం FDR లను ఆలయ ఆదాయంగా పరిగణంలోకి రాదు. 30% కు అధికంగా ఖర్చు కావడంతో. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, స్వీపర్ల జీతాల పెంపుదల వారికి అవరోధంగా మారింది అని చెప్పవచ్చు.
👉తనిఖీలలో వెలుగు చూసిన అవినీతి
గత సంవత్సరం అక్టోబర్ లో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ , ఆలయ కార్యాలయంలో, సరుకుల నిల్వ గోదాముల తనిఖీలలో చేపట్టారు. ఈ తనిఖీలలో దాదాపు నాలుగు లక్షల రూపాయలు పైగా విలువ గల దిట్టం సరుకులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు.
ఉద్యోగులపై చర్యలకు సిద్ధం అయ్యారు. ఈ దశలో నాటి బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు మంత్రులు తనిఖీ చేసిన అధికారి పై రాజకీయ ఒత్తిడి తెచ్చినట్టు చర్చ. ముక్కు సూటిగా, నిజాయితీ గా విధులు నిర్వహించే ఆ అధికారి తన పై మంత్రుల రాజకీయ వత్తిడి పట్టించుకోకపోవడంతో, దేవాదాయ శాఖ కమిషనర్ పై వారు ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.
6 A ఆలయ తనిఖి నిబంధనలలో చిన్న లోసుగు ఆధారంగా సంజాయిషి నోటీసులతో సరిపెట్టాల్సిందిగా కమిషనర్ తనిఖీ అధికారి ని కోరినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
గత ఆరు సంవత్సరాలగా ఇష్టారాజ్యంగా కొనసాగిన ఇన్చార్జ్ ఈవోల పాలన కమిషనర్ విచారణ జరిపితే లేక అవినీతి అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని భక్తజనం ముక్తకంఠంతో కోరుతున్నారు.