అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజాసంస్థల పరిష్కారానికి కృషి చేయాలి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు
గొల్లపెల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం మండల స్థాయి అధికారులతో ఎమ్మెల్యే సుమిక్ష సమావేశాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ..
వర్షాల కారణంగా వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మండలంలోని ఏ గ్రామంలో నైనా జ్వరాలతో బాధపడుతున్న వారి సమాచారం తెలిసిన వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వైద్య సహాయం అందించాలన్నారు.


మందులు, వైద్య పరికరాల పరంగా ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురావాలని, రైతులకు సంబంధించి రుణాలు మాఫీ కానివారి వివరాలు జాబితాను సిద్ధం చేసి, వారికి రుణమాఫీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మండలానికి సంబంధించిన త్రాగు నీరు అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, వర్షాల కారణంగా పాడైన రోడ్లను వెంటనే మరమత్తులు చేపట్టాలన్నారు.


విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మరియు విద్య, ఇతర శాఖలకు శాఖకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.