👉 కొందరు 20 నుంచి 30 సంవత్సరాల గా ఒకే ఆలయంలో తిష్ట !
J.SURENDER KUMAR,
గత దశాబ్దన్నర కాలంకు పైగా బదిలీలకు నోచుకోని ఆలయ ఉద్యోగులు తమ బదిలీకి దేవాదాయ శాఖకు సమర్పించిన వివరాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు ఆశ్చర్యపడుతున్నట్టు సమాచారం. కొందరు ఉద్యోగులు గత 25 నుంచి 30 సంవత్సరాల కాలంకు పైగా ఓకే ఆలయంలో బదిలీ కాకుండా తిష్ట వేసినట్టు కొందరు ఉద్యోగులు తమ బదిలీకి సమర్పించిన ఆప్షన్ సమాచారంతో వెలుగు చూసినట్టు తెలిసింది.
దేవాదాయ శాఖ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి హనుమంతరావు, పకడ్బందీగా, పారదర్శకంగా, విమర్శలకు అవకాశం లేకుండా బదిలీల ప్రక్రియకు ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈనెల 15న మెమో సంఖ్య B1/8140/2024-1. ద్వారా ఉద్యోగుల బదిలీల కోసం ఆలయాలకు సర్కులర్ జారీ చేశారు. ఈ సర్కులర్ లో నాలుగు సంవత్సరాల కాలంకు పైగా ఆయా ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇతర ఆలయాల్లో బదిలీకి ఆప్షన్ కోరుతూ తమ సర్వీస్ పూర్తి వివరాలతో దేవాదాయ శాఖకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఆలయ ఉద్యోగులలో 40 శాతం వరకే మొదటి విడత బదిలీ చేయనున్నట్టు సర్కులర్ పేర్కొనబడింది.

ఈ మేరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, డిసి, (డిప్యూటీ కమిషనర్ ) పరిధిలోని ఆలయాలు, ప్రముఖ ఆలయలు, (ఆలయ ఆదాయం నుంచి అక్కడి ఉద్యోగులకు జీతాలు చెల్లించే వాటిని) దేవదాయ శాఖ గుర్తించి, ఆ మేరకు ఉద్యోగుల బదిలీలలో విభజన చేపట్టి నివేదికలు కోరారు.
విశ్వసనీయ సమాచారం మేరకు..
👉 వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో…?
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వివిధ హోదాలు కలుపుకొని ఉద్యోగుల క్యాడర్స్ స్ట్రెంత్ 77 మంది కాగా ఆలయంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారు 63, మంది ఉద్యోగులు (14 మంది డిప్యూటేషన్, లేదా దీర్ఘకాలిక సెలవులు ఉండి ఉంటారు) నాలుగు సంవత్సరములకు పైగా ఈ ఆలయంలో కొనసాగుతున్న ఉద్యోగుల సంఖ్య 60 మంది. 40 శాతం బదిలీ నిబంధన మేరకు 25 మంది బదిలీ కానున్నట్టు సమాచారం.
👉 కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో..?
కేడర్స్ స్ట్రెంత్ ఉద్యోగుల సంఖ్య 21, పనిచేస్తున్న ఉద్యోగులు 22 మంది. 4 సంవత్సరంలో పైబడిన ఉద్యోగులు 15 మంది. 40 శాతం బదిలీ నిబంధన మేరకు (7) ఏడుగురు ఉద్యోగులు బదిలీ కానున్నట్టు సమాచారం.
👉 బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో. ?
కేడర్స్ స్ట్రెంత్ 19 మంది ఉద్యోగులు పనిచేసే వారు 9 మంది 4. సంవత్సరములు పైబడి. విధులు నిర్వహిస్తున్న వారు 8 మంది. 40 శాతం నిబంధనల మేరకు ముగ్గురు బదిలీ కానున్నట్టు సమాచారం.
👉 కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో..?
కేడర్స్ స్ట్రెంత్ 14 మంది విధులు నిర్వహించేవారు 10 మంది. 4 సంవత్సరాల కాలంకు పైగా విధులు నిర్వహిస్తున్న వారు నలుగురు. 40 శాతం బదిలీ నిబంధన మేరకు ముగ్గురు బదిలీ కానున్నట్టు సమాచారం.
👉 యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.?
కేడర్స్ స్ట్రెంత్ 70 మంది విధులు నిర్వహించే ఉద్యోగులు 67 మంది, 4 సంవత్సరాల కాలం పైగా విధులు నిర్వహిస్తున్నవారు 61 మంది. 40 శాతం బదిలీ నిబంధనల మేరకు 25 మంది ఉద్యోగులు బదిలీ కానున్నట్టు సమాచారం
.
👉 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో.. ?
కేడర్స్ స్ట్రెంత్ 22 మంది. విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు 13 మంది. 4 సంవత్సరాల పైగా విధుల్లో కొనసాగుతున్న వారు 12 మంది. 40 శాతం నిబంధనల మేరకు నలుగురు ఉద్యోగులు బదిలీ కానున్నట్టు సమాచారం.
ఇందులో ప్రముఖ సికింద్రాబాద్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ఉద్యోగుల జీతాలు గ్రాంటిన్ ఎయిడ్ కావడంతో ప్రముఖ ఆలయాల నుంచి ఈ ఆలయాన్ని మినహాయింపు ఇచ్చారు.
ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో 6 A ( దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ) 16 ఆలయాలలో నాలుగు సంవత్సరాలు కు పైగా ఉద్యోగుల విధి నిర్వహణ (సీనియార్టీ) అంశం వివాదాస్పదమైనట్టు సమాచారం.
సూపరింటెండెంట్, ఇన్స్పెక్టర్ ,సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు పది సంవత్సరాల కాలం కు పైగా ఈ ఆలయంలో విధులు నిర్వహిస్తున్న, వారిని ఎందుకు బదిలీ చేయడం లేదంటూ కొందరు ఉద్యోగులు దేవాదాయ శాఖ ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వారిని బదిలీ చేస్తే ప్రత్యామ్నాయం ( ఆల్టర్నేట్ ) నియామకం చేపట్టాల్సి ఉంటుందని, ప్రస్తుతం బదిలీల ప్రక్రియ పూర్తి కాగానే. వారిని సైతం నిబంధనల మేరకు పరస్పర ఆలయాల కు బదిలీ చేస్తామని ఉద్యోగులకు ఆధికారి హామీ ఇచ్చినట్టు సమాచారం.
ఇది ఇలా ఉండగా డిసి ( డిప్యూటీ కమిషనర్ ) పరిధిలోని ఉద్యోగుల బదిలీలు, ఆదాయ, ఖర్చులు వివరాలను జిల్లాల వారీగా పరిశీలించి నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
👉 అర్చకులకు, వేద పండితులకు బదిలీలు తప్పవా ?
దేవాలయ అర్చకులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ బదిలీలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న దేవాదాయ శాఖ తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టును కొందరు అర్చకులు ఆశ్రయించడంతో తాత్కాలికంగా వారి బదిలీలను నిలిపివేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
హైకోర్టుకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలలో వైదిక, స్మార్త, పాంచరాత్ర, -వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీ వైష్ణవ, పూజా విధి విధానాల, వేద పారాయణాలు, తదితర వివరాలను క్రోడీకరించి ఆయా ఆలయాలలో వీరిని పరస్పర బదిలీల ఆలోచనలు ఉన్నట్టు సమాచారం.
ఈ నెల చివరి వారంలో ఆలయ ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం