👉అంబేడ్కర్ విగ్రహానికి వినతి..
J.SURENDER KUMAR,
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా విధులు కొనసాగిస్తున్న జర్నలిస్టులు నివేషణ స్థలాలు, తమ హక్కుల సాధన కోసం చట్టసభలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులతో అమితుమీకి సిద్ధమైనట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్లో సమావేశమైన పట్టణ జర్నలిస్టులు దశలవారీగా తమ నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం జగిత్యాల పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమకు నివేష స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు.
ముడు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న తమ ప్రధాన మౌలిక హక్కులు, సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించేందుకు పాలకులు చొరవ చూపేలా వారికి ఆలోచన కలిగించాలని కోరుతూ … డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.
నిత్యం ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరవేసేలా కృషి చేస్తూ, ప్రజల పక్షాన గొంతుక నిలుస్తున్న…
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోరారు…
👉బుధవారం ఇందిరా గాంధీ విగ్రహానికి వినతి పత్రం!

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం కార్యాచరణకు. శ్రీకారం చుట్టిన జర్నలిస్టులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ నుండి ర్యాలీగా బయలుదేరి ఇందిరా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, అనంతరం తహాసిల్దారు కార్యాలయం లో వినతి పత్రం అందజేయనున్నారు.