J.SURENDER KUMAR,
అసెంబ్లీ సమావేశాలలో బుధవారం మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధీటుగా ప్రత్య ఆరోపణలు చేశారు.
👉ప్రసంగంలో ప్రధాన అంశాలు..
👉🏻డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి అన్న ఆర్టికల్ మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
👉🏻రాష్ట్ర ఏర్పాటు లో దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఒక దళితున్ని చేస్తానని, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తానని దళితులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం బి.అర్.ఎస్ ప్రభుత్వం.
👉🏻2014-15 నుండి 2023-24 వరకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితుల కోసం బడ్జెట్ లో చూపించిన మొత్తం ₹ 73,783 కోట్లు అయితే ఖర్చు చేసింది కేవలం ₹ 28,135 కోట్లు మాత్రమే.
👉🏻ఎస్సీ సబ్ ప్లాన్ ప్రకారం మాకు చెందవలసిన నిధులను మాకు ఖర్చు చేయకుండా గత ప్రభుత్వం మోసం చేయడం జరిగింది.
👉🏻దళిత బంధు కింద ₹ 39,841 కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించి ఖర్చు చేసింది కేవలం ₹ 3,884 కోట్ల రూపాయలు మాత్రమే.
👉🏻అర్హులైన ఏ ఒక్కరికీ కూడా దళిత బంధు రాలేదు, కేవలం గులాబీ జెండాలు మోసిన వారికి, వారి పార్టీ కార్యకర్తలకు మాత్రమే అట్టి దలితబందు ఇచ్చారు.
👉🏻బెస్ట్ అవలెబులిటీ స్కూల్స్ కి చెందిన 1800 పిల్లలకు చెందిన మెస్ బిల్లులు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు,
👉🏻ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి కానీ బి.అర్.ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలి,
👉🏻నా ధర్మపురి నియోజక వర్గంలో 1000 ఎకరాల మిగులు భూములు ఉంటే ఎందుకు దాన్ని గత ప్రభుత్వంలో ఉన్న వారు అర్హులైన పేదవారికి పంపిణీ చేయలేదు. అంటూ లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.