బి సి రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడిగా భాదినేని రాజేందర్ !

👉బిసి సాధికారత సంఘ ప్రకటన !


J.SURENDER KUMAR,

తెలంగాణ వెనుకబడిన తరగతుల సాధికారిత సంఘం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జగిత్యాల జిల్లాకు చెందిన బాదినేని రాజేందర్ నియామకం జరిగింది.
బీసీల సంక్షేమం కోసం రాజేందర్ సేవలను గుర్తించి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ మేరకు బాధినేని రాజేందర్ ను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తున్నట్లు నియామక పత్రం అందజేశారు.


బాదినేని రాజేందర్ ఇటీవల జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా కొనసాగారు. బుగ్గారం మాజీ జడ్పిటిసి గా, గతంలో ధర్మపురి ఎంపీపీగా, సింగిల్ విండో అధ్యక్షునిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీసీ సాధికారత సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి ఈ మేరకు బాదినేని రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజేందర్ నియామకం పట్ల రాష్ట్ర , అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్, కౌన్సిల్ చైర్మన్ కొవ్వూరి భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి జల్లపల్లి వెంకటేశ్వర్లు తో పాటు పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.