బీర్పూర్ లో గన్ ఎక్కడిది ?

J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా బీర్పూర్ లో అనుమానాస్పద ఓ వ్యక్తి గన్ తో సంచరిస్తున్నాడంటూ శనివారం ప్రచార మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
బీర్పూర్ మండలలో మారుమూల అటవీ గ్రామానికి చెందిన ఓ యువకుడు చేతిలో గన్ తో సంచరిస్తుండగా ఓ పోలీస్ అధికారి కంటబడినట్టు సమాచారం.

ఓ కేసు విచారణ నిమిత్తం బీర్పూర్ కు పోలీస్ అధికారి వస్తుండగా యువకుడి కదలిక గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కొంతమంది యువకులు బీర్పూర్ లో షార్ట్ ఫిలిం నిర్మాణ షూటింగులో భాగంగా యువకుడు గన్ పట్టుకొని సంచరించినట్టు చర్చ. వన్యప్రాణుల వేట కోసమా ? సంఘ విద్రోహ కార్యక్రమాల కోసమా ? షార్ట్ ఫిలిం కోసమే వచ్చారా ? అనే అంశంపై వారి నుంచి పోలీస్ వర్గాలు వివిధ కోణాలలో సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.