భోజనం పార్సిల్ లో ఊరగాయ మిస్ – 35 వేల జరిమానా !

👉వినియోగదారుల ఫోరం తీర్పు !


J.SURENDER KUMAR,

రెస్టారెంట్ లో 25 మందికి భోజనం పార్సల్ కు ఆర్డర్ చేశారు. ఒక్క భోజనం పార్సల్ కు  ₹ 80/- చొప్పున  25 భోజనాలకు ₹2000/- రెస్టారెంట్ యజమానికి కొనుగోలుదారుడు చెల్లించారు. భోజనం పార్సల్ లో ఉరగాయ  (ఆవకాయ, పచ్చడి) లేకపోవడంతో  కొనుగోలుదారుడు  హోటల్ యజమానితో, ఉరగాయ లేదు అని వివరించి, వాదించి, చివరకు  వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించి రెస్టారెంట్ యజమాని వద్ద  ₹35 వేల నష్టపరిహారం పొందాడు.


👉వివరాలు ఇలా ఉన్నాయి.


తమిళనాడులోని విల్లుపురంలో
నవంబర్ 2022లో ఆరోగ్యస్వామి,
హోటల్ బాలమురుగన్ రెస్టారెంట్  నుండి 25 భోజన పొట్లాలను ఆర్డర్ చేసి డబ్బులు చెల్లించాడు.
మరణించిన తన బంధువు మొదటి వర్ధంతి సందర్భంగా 25 మందికి భోజనం పెట్టారు.


భోజనం ఆర్డర్ చేయడానికి ముందు ఆరోగ్య స్వామి,  రెస్టారెంట్ లో  భోజనం యొక్క మెను పరిశీలించారు. అందులో తెల్ల అన్నం, సాంబార్, కార కుజంబు, రసం, మజ్జిగ, కూట్టు, పొరియాల్, అప్పడం, ఊరగాయ, పెద్ద సైజు అరటి ఆకులు, మరియు ఒక కవర్ ఉన్నాయి.


ఫంక్షన్‌కు హాజరైన వారికి ఆరోగ్య స్వామి భోజనం వడ్డిస్తున్నప్పుడు, భోజనంలో  (పచ్చళ్లు) ఉరగాయ పార్సిల్ లో లేవు.


కొనుగోలుదారుడు ఆరోగ్య స్వామి,  ఊరగాయల కోసం రెస్టారెంట్‌ యజమానిని సంప్రదించాడు.  అతిథులందరూ భోజనం పూర్తి చేశారని, మీరు రెస్టారెంట్ ఫై పచ్చళ్ళ కోసం చేసిన ఆరోపణలు, ఫిర్యాదును అంగీకరించే ప్రసక్తే లేదని రెస్టారెంట్ యజమాని కొనుగోలుదారుడైన ఆరోగ్య స్వామికి స్పష్టం చేశాడు.


రెస్టారెంట్ యాజమాన్యం భోజనం పార్సల్ లో మోసానికి పాల్పడిందని ఆరోగ్య స్వామి
విల్లుపురం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (డిసిడిఆర్‌సి) కు ఫిర్యాదు చేశాడు.
కేసు పూర్వపరాలు పరిశీలించిన అధ్యక్షుడు డి సతీష్ కుమార్ , సభ్యులు ఎస్‌ఎం మీరా మొహిదీన్ , కె అమల రెస్టారెంట్  సేవలో లోపం గుర్తించారు. ఊరగాయలను పంపిణీ చేయడంలో విఫలమవడమే కాకుండా, ఫిర్యాదుదారుడు 25 భోజనం కొనుగోలు చేసినందుకు రెస్టారెంట్ ఎటువంటి రశీదును జారీ చేయలేదని కమిషన్ కనుగొంది.

వినియోగదారుల ఫోరం తీర్పు.


2024 మే మాసంలో ఫోరం ఆరోగ్యస్వామి వివాదంలో  తీర్పు చెప్పింది.
రెస్టారెంట్ యజమాని ₹ 2,000తో కొనుగోలు చేసిన 25 భోజనాలకు బిల్లు ఇవ్వనందుకు మరియు వాటితో ₹ 1/- విలువైన పచ్చళ్లను డెలివరీ చేయనందుకు కొనుగోలుదారుడైన ఆరోగ్య స్వామికి  ₹ 35,000 చెల్లించాలని రెస్టారెంట్ యజమాని బాలమురుగన్ ను ఆదేశించింది.