J.SURENDER KUMAR,
ధర్మారం మండలం ఎర్రగుంట పల్లి గ్రామంలో ఆషాడ మాసం సందర్భంగా శనివారం పరివార సమేత శ్రీ దుర్గాదేవి ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ కన్వీనర్ పురంశెట్టి గౌతమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన జట్టలకు బహుమతులతో పాటు జ్ఞపికలను అందజేశారు.

మండలం లోత్తునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటుకుల్ల లచ్చయ్య ఇటీవల మృతి చెందరు. మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు.