👉ఎంపీ రఘునందన్ రావు మాట తీరు మార్చుకో!
👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే మాట తీరును మార్చుకోమని ఎంపీ రఘునందన్ రావు ను ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో శనివారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మరో ఎమ్మెల్యే తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
👉నోరు ఉందికదా అని, నాలుక ఉంది కదా అని ముఖ్యమంత్రి ని ఏది పడితే అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రజలు ఊరుకోరనీ రఘునందన్ రావుని హెచ్చరిస్తున్నాం అని అన్నారు.
👉కేసీఆర్ వెంట ఉంటూ వెన్ను పోటు పొడిచింది నువ్వు కాదా, హరీష్ రావు కి నీకు మధ్య ఉన్న చీకటి ఒప్పందం ప్రజలకు తెలీదా.? అని ప్రశ్నించారు.
👉 ఎంపీగా ఏలా గెలిచావో, ఎవరిని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తావో, నీ నైజం ఏంటో మెదక్ ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి తెలీదా.? అంటూ ఆరోపించారు.
👉రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నప్పటికీ అన్ని రంగాల వారికి మేలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు.
👉BRS పార్టీ గెలవదని తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ నీ కూడా గెలువనివ్వకూడదనే ఉద్దేశ్యంతో ఓట్లు బీజేపీ కి వెయ్యాలని BRS పార్టీ నాయకులు ప్రచారం చేస్తే మీరు గెలిచారు. అని ఆరోపించారు.
👉రాష్ట్రం విభజనకు సంబంధించి హామీల అమలు విషయంలో ఇప్పటివరకు ప్రధాని మోడీ , కేంద్ర మంత్రులను కలిసి అమలు కోసం వారిని అడిగారా ? అని ప్రశ్నించాడు.
👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి సంబంధించి నిధులు, అభివృద్ధి గురించి కేంద్ర మంత్రులను కలిసి అనేక సార్లు మాట్లాడారు అంటూ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వివరాలు వివరించారు.