👉మాజీ శాసనసభ్యుల సంఘ తీర్మానం !
👉మాజీమంత్రి రాజేశం గౌడ్..
J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు లను ఘనంగా సన్మానించాలని మాజీ శాసనసభ్యులు సంఘం తీర్మానం చేసిందని మాజీమంత్రి రాజేశం గౌడ్ తెలిపారు.
శాసనమండలి ప్రాంగణంలో సోమవారం మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మరియు మాజీ శాసన మండలి సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలతో పాటు, ప్రజల సంక్షేమ పథకాలు, మంత్రులను ముఖ్యమంత్రిని సన్మానించాలని తీర్మాంచుకున్నారు. వారి అపాయింట్మెంట్ తీసుకొని మరోసారి సమావేశమై కార్యాచరణకు శ్రీకారం చుట్టూ ఉన్నట్టు మాజీమంత్రి రాజేశం గౌడ్ తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు రామ్ కిషన్ రావు, సుద్దాల దేవయ్య, నేరెళ్ల ఆంజనేయులు , మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసనసభ్యుల సంఘం అధ్యక్షులు డాక్టర్ లింగయ్య, సభ్యులు రాజా రెడ్డి, సారయ్య, సంజీవ్ రావు, డాక్టర్. కె. నగేష్ , పండరి, ఆరేపల్లి మోహన్ , కత్తెర గంగాధర్ , సత్యనారాయణ గౌడ్ , శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.