కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి గా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పేరు పరిశీలన ?



J.SURENDER KUMAR,

త్వరలో నియమించనున్న తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అభ్యర్థుల పేర్ల పరిశీలనలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పేరు చర్చకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఏఐసీసీ అగ్ర నేతలు. సీనియార్టీ , సిన్సియారిటీ, సామాజిక వర్గాల సమీకరణలు తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకుల పేర్లతోపాటు దళిత ( మాదిగ ) సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పేరును పరిశీలించినట్టు సమాచారం. ఈ అంశం మంగళవారం ప్రచార మాధ్యమాలలో ప్రచురితమయ్యాయి.

సీనియార్టీ.. సిన్సియారిటీ !

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, ఎన్నికల్లో ఓడిన, గెలిచిన కాంగ్రెస్ పార్టీని వీడని సీనియర్, సిన్సియర్ నాయకుడిగా, పార్టీ అధిష్టానం లో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2006 స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా పోటీచేసి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి మాతంగి నరసయ్య పై, మూడు వేల ఓట్ల మెజార్టీతో విజయ సాధించారు.

రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా లక్ష్మణ్ కుమార్ దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ 2014 కొరకు కొనసాగారు. అసెంబ్లీ పునర్ విభజికరణ లో ఏర్పడిన నూతన ధర్మపురి రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చేతి లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు, ఇదే నియోజకవర్గంలో నుంచి మధ్యంతర ఎన్నికల్లో ను టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి లక్ష్మణ్ కుమార్ ఓటమి చెందారు. 2014 స్వరాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోను కాంగ్రెస్ అభ్యర్థిగా తిరిగి ధర్మపురి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీచేసి ఓడిపోయారు.


2018 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థి నాటి చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేసి కేవలం నాలుగు వందల ఓట్లతో లక్ష్మణ్ కుమార్ ఓటమి చెందారు. ( ఓట్ల లెక్కింపులో అధికారులు అవకతవకలకు పాల్పడి తనను ఓడించారని లక్ష్మణ్ కుమార్, హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే)


2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, క్యాబినెట్ సిట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను భారీ ఓట్ల మెజార్టీతో ఓడించి లక్ష్మణ్ కుమార్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. జగిత్యాల జిల్లా లో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే గా లక్ష్మణ్ కుమార్ గెలిచారు.


2009 నుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పై పోటీ చేస్తూ ఓటమి చవిచూస్తున్న, లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీనీ వీడలేదు, నిరంతరం ప్రజా సమస్యలపై, ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. లక్ష్మణ్ కుమార్ పై బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేసింది.

ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేసింది. బీఆర్ఎస్ మంత్రుల పర్యటన ల సందర్భంగా లక్ష్మణ్ కుమార్ తో పాటు క్యాడర్ ను గృహ నిర్బంధాలు, ముందస్తుగా అదుపులో తీసుకొని సుదూర అటవీ ప్రాంత పోలీస్ స్టేషన్ ల కు తరలింపు తదితరు ఇబ్బందులకు గురి చేసినా లక్ష్మణ్ కుమార్, నియోజకవర్గాన్ని వీడలేదు, ఆందోళనలు ఆపలేదు.