J.SURENDER KUMAR,
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రాష్ట్ర రైతాంగానికి ₹ 1 లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయనున్న సందర్భంగా గురువారం జగిత్యాల పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ మరియు సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేక నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారుఈ సందర్భంగా రైతులకు ₹ 1 లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలిపారు.
👉పరామర్శ..

ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్థ లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి జగిత్యాల లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అతడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు, హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
👉ఆశా వర్కర్ల సమస్య పరిష్కరిస్తా..

ఆశా వర్కర్లకు సంబంధించిన ప్రతి విజ్ఞప్తిని ముఖ్యమంత్రి దృష్టికి, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశ వర్కర్లు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు
ఆశా వర్కర్లకు గత 15 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు, 2024 ఫిబ్రవరి 9 న ఆరోగ్య కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆశా వర్కర్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.