డిప్యూటీ సీఎం నివాసం బోనాల ఉత్సవంలో ధర్మపురి ఎమ్మెల్యే!

J.SURENDER KUMAR,


ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నివాసంలో ఆదివారం జరిగిన బోనాల పండగ ఉత్సవంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లురి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


హైదరబాద్ లోని ప్రజాభవన్ లో ఘనంగా జరిగిన బోనాల ఉత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ , తదితరులు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు.