ధర్మపురి ఆలయంలో నిత్య అన్నదానానికి పది లక్షల రూపాయల విరాళం !

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకానికి ఓ భక్తుడు ₹10 లక్షల రూపాయలు విరాళం అందించారు.
వివరాల్లోకి వెళితే..

హైదరాబాదుకు చెందిన నరసింహ భక్తురాలు దాత శ్రీమతి బద్దం సునీత, ఈనెల 13న ₹ 5 లక్షలు, బుధవారం మరో ఐదు లక్షలు నిత్యాన్నదాన పథకానికి మొత్తం ₹10 లక్షలు కార్యనిర్వహణాధికారికి అందించారు. ఈ నెల 8 న లక్షల రూపాయల విలువగల రెండు మంగళసూత్రాలను శ్రీ లక్ష్మి అమ్మవారికి అందించారు.


ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు అధికారులు దాతలను ఘనంగా సన్మానించి స్వామివారి శేష వస్త్రం ప్రసాదం అందించారు.