ధర్మపురికి తాగునీటి కోసం అమృత్ స్కీమ్ కింద ₹ 17 కోట్ల నిధులు !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి మున్సిపల్ పట్టణంతోపాటు మండలం పలు గ్రామాలలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్ స్కీమ్ కింద దాదాపు ₹ 17 కోట్ల నిధులతో పనులు చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళిక కు శ్రీకారం చుట్టినట్టు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ధర్మపురి మండలం కమలపూర్ ఫిల్టర్ బెడ్ ను సోమవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధిత శాఖ అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

ధర్మపురి మున్సిపాలిటీ, మరియు మండల వివిధ గ్రామాల ప్రజలు తాగునీటి కోసం (డబ్బా, మిషన్ భగీరథ ఫిల్టర్ రిజర్వాయర్) పై ఆధారపడకుండా శాశ్వత నీటి పరిష్కారం చూపే విధంగా అమృత్ స్కీమ్ కింద దాదాపు ₹ 17 కోట్ల నిధుల వ్యయంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం, కమలాపుర్ ఫిల్టర్ బెడ్ నుండి పైప్ లైన్ ద్వారా ట్యాంకులలోకి నీటిని నింపి ఈ ప్రాంతానికి తాగు నీరు అందించే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు.

దీనికి సంబంధించి ఇరిగేషన్, గ్రిడ్, మిషన్ భగిరథ అధికారులు, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ తో కలిసి కమలపూర్ ఫిల్టర్ బెడ్ ను పరిశీలించినట్టు వివరించారు. వాటర్ ఫీడింగ్ గూర్చి అధికారులతో చర్చించినట్టు వివరించారు. గత ప్రభుత్వంలో పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మపురి పట్టణానికి అనుకొని గోదావరి నది ఉన్న ఎక్కడో ఉన్న డబ్బా గ్రామం నుండి నీటిని అందించే విధానం ఉండేదన్నారు. పైప్ లైన్ లో ఏదైనా సమస్యలు ఏర్పడితే వారం రోజులపాటు నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉండేది కాదన్నారు.

ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసిన ప్రతి సందర్భంలోనూ ధర్మపురి నియోజకవర్గానికి త్రాగు, సాగు నీరు అందించే విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేసేవాడినని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. తాగు సాగునీటి కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి కృషి చేస్తానని ఎమ్మెల్యే అధికారులకు ఈ సందర్భంలో తెలిపారు. ఎమ్మెల్యే వెంట అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు