ధర్మపురిలో రైతు రుణమాఫీ ఉత్సవాలు బైక్ ర్యాలీలోఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR ,

ధర్మపురిలో రైతు రుణమాఫీ ఉత్సవాలలో బైక్ ర్యాలీలోఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. రైతాంగానికి ₹ 1 లక్ష రూపాయల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిన సందర్భంగా గురువారం రోజున ధర్మపురి నుండి తిమ్మాపూర్ వరకు బైక్ ర్యాలితో గ్రామంలో రైతు వేదిక లో నిర్వహించి నిధుల విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తిమ్మాపూర్ గ్రామంలోనీ రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రసంగాన్ని రైతులతో కలిసి వీక్షించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

భారత దేశంలో ఇప్పటివరకు రైతులకు సంబంధించిన ₹ 2 లక్షల రూపాయల రుణాలను ఏకకాలంలో రద్దు చేసిన దాఖలాలు లేవని, ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ లో గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కనీసం ₹1 లక్ష రూపాయల రుణ మాఫీనీ కూడా చేయలేకపోయింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ₹ 31 వేల కోట్లతో రుణ మాఫీ చేయనుందని, రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఎన్నికల్లో ఇచ్చిన హామీనీ నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో రూపాయి రూపాయి పోగు చేసి రైతులకు రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు.

ఆగస్టు 15 వరకు రైతులకు పూర్తి స్థాయిలో రుణాలను మాఫీ చేస్తామని, ఇచ్చిన ఆరు గ్యారేంటిలలో 5 గ్యారేంటీలను అమలు చేయడం జరిగిందని, రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుందని, ఇది రైతులందరు సంతోషంగా ఉండవలసిన సమయమని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటుందని,రైతును రాజును చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఉండనున్నాయన్ని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.