👉₹14 లక్షల 22 వేల 643 రూపాయలు
👉185 పట్టణ మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు!
J.SURENDER KUMAR,
గురువారం ధర్మపురి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా ), పురపాలక సంఘం ఆధ్వర్యంలో 185 పట్టణ మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కును పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ మహిళా సంఘ సభ్యులకు అందించారు.

ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు ఈ చెక్కును సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా సభ్యులందరూ తోడ్పాటు చేసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ శక్తి, మహిళా శక్తి కార్యక్రమాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, జిల్లాకు మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి టార్గెట్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.

ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే ధర్మపురి పట్టణంలో ఈ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని కలెక్టర్ తెలిపారు. యాక్టివ్ గా ఉన్న మహిళా సంఘాల సభ్యులను నమోదు చేసుకుంటే ప్రభుత్వం నుండి గైడ్ లైన్స్ రాగానే క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని తద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా అధికారులు, సిబ్బంది, మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.