J.SURENDER KUMAR,
పెద్ద పెల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గురువారం ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలసి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఆలయ సాంప్రదాయ మేళతాళాలతో వేదపండితులు, అర్చకులు, స్వాగతించారు. ఆశీర్వచనం అనంతరం దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేసి సన్మానించారు.
👉ఎంపీకి ఘన స్వాగతం !

పెద్దపెల్లి పార్లమెంట్ ఎంపి గా గెలుపొంది మొదటిసారి ధర్మపురికి గడ్డం వంశీకృష్ణ రాక సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్
ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద,
మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
👉వనమహోత్సవంలో…

75 వ ఇందిరా వన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి స్థానిక బస్ స్టాండ్ ఆవరణలో ఎంపీ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం లో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని,
ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 46 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించడం జరిగిందని, ప్రజలు కోరుకున్న విధంగానే పూలు, పండ్ల మొక్కలనే పంపిణీ చేయడం జరుగుతుందని, నాటిన ప్రతి మొక్కను రక్షించి వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని అన్నారు.

👉నైట్ కళాశాల ను ప్రారంభించిన ఎంపీ !
టిఆర్ఎస్ ప్రభుత్వంలో మూతపడిన స్థానిక శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృత ఆంధ్ర కళాశాలను. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కళాశాలను వినియోగించుకోవాలని, మౌలిక వసతులు సదుపాయాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని ఎంపీ అన్నారు. కళాశాల ఉన్న ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కృషి ప్రశంసనీయం అభినందనీయమని ఎంపీ అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.