దీన్ని ఆఫీస్ అంటారా ? మంత్రి శ్రీధర్ బాబు!

J.SURENDER KUMAR,

తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉంది. దీన్ని ఆఫీస్ అంటారా ? అని ఐటి శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.


దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? మూడు నెలల్లో ఆఫీస్ మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌, పాత ఫైళ్లను డిజిటలైజేషన్ చేసి, ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్‌పై న్యాయమైన రిపోర్ట్ తయారు చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


ఈ రిపోర్ట్‌పై ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగిన కఠిన చర్యలు తప్పవు. మంత్రి గా తాను, అధికారులు గా మీరు ఎలాంటి ఆఫీసు వాతావరణంలో కూర్చొని పని చేస్తున్నామో.. ప్రతి ఉద్యోగి కూడా అదే తరహా వాతావరణంలో కూర్చొని పని చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు సూచించారు
.